Sajjala: నోటీసులపై స్పందిస్తూ.. జత్వానీ పేరు ఎత్తిన సజ్జల
ABN, Publish Date - Oct 16 , 2024 | 06:05 PM
చంద్రబాబు పాలనలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అబద్దాన్ని నిజం చేయగల సత్తా చంద్రబాబుకు ఉందన్నారు. అక్టోబర్ 7వ తేదీన తన ఫ్యామిలీతో కలిసి తాను విదేశాలకు వెళ్లానని చెప్పారు. అక్టోబర్ 14వ తేదీన విదేశాల నుంచి న్యూఢిల్లీ తిరిగి వచ్చామని చెప్పారు. ఆ సమయంలో విమానాశ్రయ అధికారులు అభ్యంతరం తెలిపారన్నారు.
అమరావతి, అక్టోబర్ 16: చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరుకావాలంటూ మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేయడంతోపాటు తనకు లుకౌట్ నోటీసులు జారీ చేసిందంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆ క్రమంలో బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అబద్దాన్ని నిజం చేయగల సత్తా చంద్రబాబుకు ఉందన్నారు. అక్టోబర్ 7వ తేదీన తన ఫ్యామిలీతో కలిసి తాను విదేశాలకు వెళ్లానని చెప్పారు. అక్టోబర్ 14వ తేదీన విదేశాల నుంచి న్యూఢిల్లీ తిరిగి వచ్చామని చెప్పారు. ఆ సమయంలో విమానాశ్రయ అధికారులు అభ్యంతరం తెలిపారన్నారు.
Also Read: Viral Video: వంటింటిలో కెమెరా.. అడ్డంగా దొరికిపోయిన రీనా..
దీనిపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తుందని మండిపడ్డారు. తాను న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లి.. అటు నుంచి తాడేపల్లి వస్తున్నానన్నారు. అంతే కానీ.. మీ పెండ్యాల శ్రీనివాసరావు లాగా, మీ పార్టీలోని ఇతర నేతల్లాగా తాను పారిపోవడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కానీ తనకు లుకౌట్ నోటీసులు పేరుతో హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో మూడు ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు ఇప్పుడు బయటకు తీశారని గుర్తు చేశారు. అసలు ఆ నాడు ఆ దాడి జరగడానికి కారణం ఏమిటో అందరికీ తెలుసునన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని టీడీపీ నేతలు దారుణంగా దూషించారని గుర్తు చేశారు.
Also Read: Chandra Mangal Yuti: మరికొద్ది రోజుల్లో ఈ మూడు రాశుల వారికి బంగారు యోగం..
అయితే సుప్రీంకోర్టు తనకు ఇటీరియమ్ ప్రొడక్షన్ సైతం ఇచ్చిందన్నారు. అది కూడా సెప్టెంబర్ 20వ తేదీనే ఇచ్చిందని.. అలాంటప్పుడు తనకు ఇప్పుడు నోటీసులు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. చేతిలో అధికారం ఉందని ఎలాగైనా నోటీసులు ఇస్తారా? దీన్ని బరితెగింపు అనాలా? పొగరు అనాలా? ఇంకేమైనా అనాలా? అసలు రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
Also Read: Telangana: గుండు సున్నా చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఏ మాత్రం ఆధారం లేని విషయాలలో కూడా నోటీసులు ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈడీ అటాచ్‌మెంట్ చేసిందంటే.. చంద్రబాబు తప్పుడు పని చేసినట్టు నిర్ధారణ అయిందన్నారు. అందుకే ఆస్తుల అటాచ్‌మెంట్ జరిగిందని తెలిపారు. కానీ చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎలా రాస్తారు? అని ప్రశ్నించారు. ఇంతకన్నా బరితెగింపు ఉంటుందా? అలా తప్పుడు ప్రచారం చేసి జనాన్ని నమ్మించగలరేమోగానీ కోర్టులను మాత్రం నమ్మించ లేరన్నారు. జత్వానీ కేసులో కూడా తనను ఇలాగే ఇరికించారని ఆరోపించారు.
Also Read: మీ పాదాల వంపు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుంది.. జస్ట్ ఓ సారి చెక్ చేసుకోండి..!
ఏదోలాగ తనను కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై సజ్జల ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఉద్దేశ పూర్వకంగా నాడు సీఎం జగన్‌ని దూషించారన్నారు. అప్పుడు టీడీపీ ఆఫీసుపై గొడవ జరిగిందని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని సజ్జల ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు.
ఎలాంటి నేరం జరగక పోయినా జరిగినట్టుగా క్రియేట్ చేసి కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇక బోట్లతో ప్రకాశం బ్యారేజిని కూల్చాలని ప్లాన్ చేశారని కూడా కేసులు పెట్టారని చెప్పారు. అయినా ఇలాంటి వారికి న్యాయంతో పనిలేదు.. ఏదోలా కేసుల్లో ఇరికించాలనే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. వైసీపీలో యాక్టివ్‌గా ఉన్న వారందరినీ లక్ష్యంగా చేసి భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
For AndhraPradesh News And Telugu News...
Updated Date - Oct 16 , 2024 | 06:56 PM