ఓర్వకల్లులో సెమీ కండక్టర్ పరిశ్రమ
ABN, Publish Date - Dec 21 , 2024 | 11:47 PM
భారతదేశంలో తొలి సెమి కండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లులో ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే అభివృద్ది సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఓర్వకల్లు మండల మీట్‌లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఓర్వకల్లు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో తొలి సెమి కండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లులో ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే అభివృద్ది సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం ఓర్వకల్లులోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ తిప్పన్న అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో గతంలో చర్చించిన అంశాలు, వాటి పురోగతిపై ఆయా శాఖ అధికారులు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. మండలాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన పరిశ్రమ ఏర్పాటుకు స్థలం కూడా సేకరించడం జరిగిందని, డ్రోన అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే భారత దేశంలో తొలి సెమి కండక్టర్ పరిశ్రమ కారిడార్‌లో భాగంగా ఓర్వకల్లులో పరిశ్రమ స్థాపనకు రూ.14వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించబోతున్నారన్నారు. పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని క్రిస్మస్ పండుగ మధ్యలో రావడం శుభపరిణామమన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం దిశగా పయనిస్తుందన్నారు. వైసీపీ పాలనలో ఎలాంటి పరిశ్రమలు రాలేదని, కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విద్యాసాగర్, ఏవో సుధాకర్, ఎంఈవో ఓంకార్ యాదవ్, జడ్పీటీసీ రంగనాథగౌడు, టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, ఈవోఆర్‌డీ సుబ్బరాయుడు, తహసీల్దార్ విద్యాసాగర్, ఇంజనీర్లు శ్రీనివాసులు, నరేంద్రనాథ్‌రెడ్డి, రామయ్య, సర్పంచులు చంద్రగోవర్దనమ్మ, అయ్యస్వామి, పెద్దకాశీం, ఎంపీటీసీలు జీకే చిన్నమ్మ, సరోజమ్మ, పుల్లయ్య, సోమశేఖర్ రెడ్డి, పద్మనాభ రెడ్డి, నాగ శిరీష, ఎస్‌ఐ సునీల్ కుమార్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కల్లూరు: టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీఠ వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. శనివారం తన స్వగృహంలో అర్హులైన బాదితులకు ఎమ్మెల్యే రూ. 12,49, 804 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ పంఢ్ కింద ఆకేపోగు పూలరాజుకు రూ. 35787, శివశంకర్‌రెడ్డికి రూ. 34,629, బొంతల సతీ్‌షకుమార్‌కు రూ.65,000, ఎ.వెంకటరామిరెడ్డికి రూ. 65,719, కురువ శకుంతలకు రూ. 1,08, 600, తూము బాలీశ్వరరెడ్డికి రూ. 37,983, పెరుమల రాజేష్‌కు రూ. 6.02086, సయ్యద్ అబ్దుల్ కరీంకు రూ. 50,000, సత్యనారాయణకు రూ. 250,000 చెక్కులను అందజేశారు.
Updated Date - Dec 21 , 2024 | 11:47 PM