మహిళా శక్తికి నిదర్శనం దసరా
ABN, Publish Date - Oct 12 , 2024 | 03:37 AM
‘దసరా అంటే మహిళా శక్తికి నిదర్శనం. అందుకే ఈ పండుగ మహిళలకు ప్రత్యేకం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలోని బబ్బురి గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన ‘శక్తి విజయోత్సవం’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
‘శక్తి విజయోత్సవం’లో నారా భువనేశ్వరి
విజయవాడ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘దసరా అంటే మహిళా శక్తికి నిదర్శనం. అందుకే ఈ పండుగ మహిళలకు ప్రత్యేకం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలోని బబ్బురి గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన ‘శక్తి విజయోత్సవం’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళల విజయాలను గుర్తించి వారిని అభినందించాలని, ప్రోత్సహించాలని కోరారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలు ఈ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయని చెప్పారు.
అయితే ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమేనని, మహిళలపై ఇంకా సమాజంలో వివక్ష కనిపిస్తోందని, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మహిళా తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ‘ప్రతి మహిళా తమలో ఉన్న దుర్గా శక్తిని గుర్తించాలి, అప్పుడే విజయం లభిస్తుంది. చేనేత, వారంలో రెండుసార్లు అయినా చేనేత వస్ర్తాలు ధరించాలి. రాజకీయ, సినీ, వ్యాపార రంగాల వారు కూడా చేనేత వస్ర్తాలు కొనుగోలు చేయాలి’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ‘స్ర్తీ లేకపోతే జననం లేదు... స్ర్తీ లేకపోతే సృష్టిలో జీవం లేదు... స్ర్తీ లేకపోతే అసలు సృష్టే లేదు... అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ శక్తిని కలిగిన ప్రతి స్ర్తీని గౌరవిద్దాం’ అని ఆమె కోరారు. హోంమంత్రి అనిత, బీసీ మంత్రి సవిత, పర్యాటక మంత్రి దుర్గేశ్ ప్రసంగించారు.
Updated Date - Oct 12 , 2024 | 03:37 AM