ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మహిళనని చూడకుండా అసెంబ్లీలో అవమానించారు

ABN, Publish Date - Apr 14 , 2024 | 04:29 AM

మహిళననే విచక్షణ కూడా లేకుండా దేవాలయం వంటి అసెంబ్లీలో తనపై తప్పుడు విమర్శలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు...

వైసీపీ పాలనలో మహిళలపై అడుగడుగునా దాడులే

అభివృద్ధి కావాలంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించేయండి

చంద్రబాబు అరెస్టు జీవితంలో మర్చిపోలేని దుర్దినం

ఆయన తప్పు చేయరని బలంగా నమ్ముతాను

అందుకే నిజం గెలవాలని బయటకు వచ్చాను

‘నిజం గెలవాలి’ ముగింపు సభలో భువనేశ్వరి ప్రసంగం

భారీగా వచ్చిన మహిళలు.. కిక్కిరిసిన సభా ప్రాంగణం

విజయవాడ/తిరువూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మహిళననే విచక్షణ కూడా లేకుండా దేవాలయం వంటి అసెంబ్లీలో తనపై తప్పుడు విమర్శలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఎన్టీఆర్‌ ఇచ్చిన పౌరుషంతోనే ఈ పరిణామాలను తట్టుకున్నానని చెప్పారు. వైసీపీ రాక్షస పాలనలో మహిళపై అడుగడుగునా దాడులు జరుగుతున్నాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో శనివారం ‘నిజం గెలవాలి’ ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. ‘ చంద్రబాబు అరెస్టు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. సెప్టెంబరు 10న మా పెళ్లి రోజు. ఆ రోజు లోకేశ్‌ నుంచి ఫోన్‌ వస్తే పెళ్లి శుభాకాంక్షలు చెప్పడానికి అనుకున్నాను. కానీ నాన్నను అరెస్టు చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా నాకు ఏమీ తోచలేదు. చంద్రబాబు అరెస్టుతో కుటుంబ సభ్యులం అందరం నాలుగు దిక్కులకు చెల్లాచెదురయ్యాం. లోకేశ్‌ కోర్టు కేసుల గురించి ఢిల్లీ వెళ్లారు. దేవాన్ష్‌ హైదరాబాద్‌లో ఉండిపోయాడు. నేను, కోడలు బ్రాహ్మణి రాజమండ్రి జైలు వద్దే ఉన్నాం. 53 రోజులు ఎలా బతికామో మాకే తెలియదు. నా భర్త అరెస్టు అక్రమమని నేను బలంగా నమ్మాను. ఏ కేసులోనూ అధికారులు ఒక్క ఆధారం చూపలేకపోవడమే నా నమ్మకానికి నిదర్శనం. తండ్రి, భర్త, కొడుకు రాజకీయాల్లో ఉన్నా ఏనాడూ బయటకు రాని నేను, చంద్రబాబు అరెస్టు అక్రమమని తెలియజేసేందుకు నిజం గెలవాలి కార్యక్రమంతో జనంలోకి వచ్చాను’ అని భువనేశ్వరి పేర్కొన్నారు. అన్నక్యాంటీన్ల ద్వారా లక్షల మంది పేదలకు ఆహారం అందిస్తున్న పథకాన్ని రద్దు చేయడంతో పాటు ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ దుర్మార్గపు పాలన ప్రారంభమైందని భువనేశ్వరి నిప్పులు చెరిగారు. ఈ పాలకులకు దోచుకుతినడం తప్ప ప్రజాసంక్షేమం, అభివృద్ధి పట్టదని, అక్రమాల్ని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగటం వైసీపీ నీచ సంస్కృతి అని విమర్శించారు. మూడు రాజధానులు అంటున్న ఈ ప్రబుద్ధులు చివరకు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి కావాలంటే ఎన్నికల కురుక్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో వైసీపీ రాక్షస పాలనను అంతమొందించాలని కోరారు. ఎన్డీయే అభ్యర్థుల్ని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా, చంద్రబాబు అక్రమ అరెస్టు వార్త విని మృతి చెందిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శించి, ఓదార్చాలన్న ఉద్దేశంతో భువనేశ్వరి ప్రారంభించిన నిజం గెలవాలి కార్యక్రమం 6 నెలలపాటు కొనసాగింది. 2023 అక్టోబరు 25న చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర ముగింపు కార్యక్రమం శనివారం తిరువూరులో జరిగింది. ఈ 6 నెలల్లో భువనేశ్వరి 203 మంది కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను కలసి ఓదార్చారు. 150కి పైగా ప్రసంగాలతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపారు. 6నెలల సమయంలో ఆమె సుమారు 9,080 కిలోమీటర్ల మేర ప్రయాణించారు.

Updated Date - Apr 14 , 2024 | 06:52 AM

Advertising
Advertising