ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో ఏపీపై వరాల జల్లు

ABN, Publish Date - Jul 23 , 2024 | 12:07 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీపై వరాల జల్లు కురిసింది. ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఏపీకి రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామన్నారు.

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీపై వరాల జల్లు కురిసింది. ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఏపీకి రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ఏపీకి కేంద్రం ప్రకటించింది.


ఈ సాయం రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని నిర్మలమ్మ తెలిపారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. పోలవరం ఏపీ జీవనాడిగా పేర్కొన్నారు. ఆహార భద్రతకు కూడా పోలవరం నిర్మాణం ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్ తెలిపారు. పారిశ్రామిక కారిడార్‌ల అభివద్ధికి ప్రాజెక్టులను ప్రకటించారు. విశాఖ-చెన్నయ్, హైదరాబాద్-బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌లను నిర్మల ప్రకటించారు.


ఏపీలో నాలుగు రంగాల్లో కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు కేటాయిస్తామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. రాయలసీమ, ప్రకాశం, కోస్తా ఆంధ్రలలో వెనుకబడిన జిల్లాలకు ఆర్ధికసాయం అందిస్తామన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నిర్మల నెరవేరుస్తామన్నారు. పూర్వోదయ పథకం ద్వారా తూర్పు రాష్ట్రాలైన బిహార్, ఏపీ, జార్ఘండ్, బెంగాల్, ఓరిస్సాలకు ప్రత్యేక ప్రాజెక్టులను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి..

AP Assembly: ఇవాళ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

Hyderabad: స్మిత సబర్వాల్‌ పోస్ట్‌ కలకలం.. నగరంలో దివ్యాంగుల నిరసన

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 12:39 PM

Advertising
Advertising
<