ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా విపత్తు సహాయ నిధికి శ్రీసిటీ పరిశ్రమల రూ.కోటి విరాళం

ABN, Publish Date - Dec 20 , 2024 | 05:08 AM

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌)లో భాగంగా తిరుపతి జిల్లా విపత్తు సహాయ నిధికి శ్రీసిటీ పరిశ్రమలు రూ.కోటి విరాళాన్ని అందించాయి.

శ్రీసిటీ, డిసెంబరు 19: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌)లో భాగంగా తిరుపతి జిల్లా విపత్తు సహాయ నిధికి శ్రీసిటీ పరిశ్రమలు రూ.కోటి విరాళాన్ని అందించాయి. ప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్‌ యువరాజ్‌, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సమక్షంలో శ్రీసిటీ ఎండీ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి ఈ విరాళం చెక్కును జాయింట్‌ కలెక్టర్‌ శుభం భన్సల్‌కు అందజేశారు. శ్రీసిటీ, పరిశ్రమల భాగస్వామ్య సమష్టి కృషిని యువరాజ్‌ ప్రశంసించారు. ఈ తరహా సాయం సామాజిక బాధ్యత, సమాజ సంక్షేమం పట్ల కార్పొరేట్‌ రంగం నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ విపత్తు సహాయ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో శ్రీసిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

ఐలాకు టీహెచ్‌కే అంబులెన్స్‌ విరాళం

సీఎ్‌సఆర్‌ చర్యల్లో భాగంగా శ్రీసిటీలోని లీనియర్‌ మోషన్‌ గైడ్‌లను ఉత్పత్తి చేసే ప్రముఖ జపనీస్‌ పరిశ్రమ టీహెచ్‌కే ఇండియా రూ.29 లక్షల విలువైన అంబులెన్స్‌ను శ్రీసిటీలోని ఇండస్ట్రీయల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ (ఐఏఎల్‌ఏ) కార్యాలయానికి విరాళంగా ఇచ్చింది.

Updated Date - Dec 20 , 2024 | 05:08 AM