ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawankalyan: పవన్‌ సారూ.. మీరే దిక్కు!

ABN, Publish Date - Jul 31 , 2024 | 02:33 AM

అయిదున్నర శతాబ్దాలుగా ఇదే ఇంటిలో నివాసముంటున్నాం. కోర్టు డిక్రీ ద్వారా మాకు ఇది దఖలు పడింది.

  • ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు

  • మాపై దౌర్జన్యం చేశారు.. గొలుసు లాక్కుపోయారు

  • పిఠాపురం మహారాజా మేనకోడలు, కుమారుల ఆవేదన

  • న్యాయం చేయాలని డిప్యూటీ సీఎంకు వినతి

పిఠాపురం, జూలై 30: ‘అయిదున్నర శతాబ్దాలుగా ఇదే ఇంటిలో నివాసముంటున్నాం. కోర్టు డిక్రీ ద్వారా మాకు ఇది దఖలు పడింది. ఇప్పుడు మేము ఉంటున్న ఇంటిని తాము కొన్నామంటూ కొందరు వ్యక్తులు వచ్చి ఖాళీ చేయమని బెదిరించడంతోపాటు దౌర్జన్యం చేశారు. వీరి వెనుక కొందరు నాయకులు ఉన్నారు. పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మాకు న్యాయం చేయాలి. లేకుంటే చావే శరణ్యం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం మహారాజా మేనకోడలు, ఆమె కుమారులు. వీరు పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి మంగళవారం విడుదల చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురుగాగల వీధిలో మహారాజా కోడలు విన్నపాల చంద్రలేఖ(78), తన ఇద్దరు కుమారులు రంగారావు, మాధవరావుతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరు 1970 నుంచి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. దీనిపై వివాదం ఏర్పడగా 1974లో కోర్టు ద్వారా డిక్రీ పొందారు. రెండు నెలల క్రితం ఈ ఇంటిని తాము కొనుగోలు చేశామంటూ జిగటాల లక్ష్మి అనే మహిళతోపాటు కొందరు వ్యక్తులు వచ్చి చెప్పి ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారన్నారు. ఇది తమ ఇల్లు అని, మీకు ఎవరు అమ్మారని ప్రశ్నించగా వినకుండా తమపై రెండు, మూడు సార్లు వచ్చి దౌర్జన్యం చేయడంతోపాటు తమను ఇంటి నుంచి బయటకు లాగి మెడలో చైన్‌ లాక్కుని పోయారని చంద్రలేఖ, కుమారులు తెలిపారు. వీరికి కొందరు నేతలు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై తాము జిల్లా ఎస్పీకి, పిఠాపురం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తమపై దౌర్జన్యం చేసిన వారికే మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు. అయిదున్నర దశాబ్దాలుగా తాము ఉంటున్న ఇంటిని బలవంతంగా ఖాళీ చేయించి ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కోరుతూ మహారాజా మేనకోడలు విన్నపాల చంద్రలేఖ, కుమారుడు మాధవరావు వీడియో ద్వారా కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమకు న్యాయం జరగకుంటే చావే శరణ్యమని వారు తెలిపారు.

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు: పవన్‌

రాష్ట్రంలో వన్య ప్రాణులను వేటాడినా, అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. అటవీశాఖ ఉద్యోగులపై దాడులు చేసే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విజయపురిసౌత్‌ రేంజ్‌ అటవీశాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై మంగళవారం ఆయన పల్నాడు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడారు. దాడి ఘటనపై ఆరా తీశారు. వన్యప్రాణులను వేటాడినా, అక్రమంగా రవాణా చేసినా, అటవీ సంపదకు నష్టం కలిగించినా.. ఎవర్నీ ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఏపీలో సుస్థిర ప్రభుత్వం: పవన్‌

డిప్యూటీ సీఎంను కలిసిన యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఏపీలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సృష్టం చేశారు. మంగళవారం మంగళగిరిలోని ఆయన నివాసంలో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి అయినందుకు అభినందనలు తెలియజేస్తూ జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా లార్సన్‌ బృందాన్ని పవన్‌ సత్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయని పవన్‌ తెలిపారు. పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని వారికి వివరించారు.

Updated Date - Jul 31 , 2024 | 08:55 AM

Advertising
Advertising
<