ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్కిల్‌ కేరాఫ్‌ ఏపీ

ABN, Publish Date - Aug 28 , 2024 | 03:47 AM

రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతలో నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం యోచన చేస్తోంది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు మేధోమథనం నిర్వహించారు.

రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు

నైపుణ్యాభివృద్ధి శిక్షణకు హబ్‌గా తీర్చిదిద్దే యోచన

దేశానికే తలమానికంగా ఏర్పాటు చేసేలా చర్యలు

నైపుణ్య గణన ఫైలుపై ఇప్పటికే సీఎం సంతకం

ప్రతి జిల్లాలోనూ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు

ఇవన్నీ స్కిల్‌ వర్సిటీకి అనుబంధంగా ప్రారంభం

తగిన విద్యార్హతలున్న వారికి వివిధ రంగాల్లో శిక్షణ

ఇక్కడ శిక్షణ పొందిన యువతకు వర్సిటీ సర్టిఫికెట్లు

అది ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యం

పరిశ్రమలకు మానవ వనరుల కేంద్రంగా వర్సిటీ

నిపుణులైన సిబ్బంది కొరతకు చెక్‌ పెట్టే అవకాశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతలో నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం యోచన చేస్తోంది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు మేధోమథనం నిర్వహించారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్‌ సెన్సెస్‌ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్య స్థాయులను పెంచుతామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఫైలుపైనే ఆయన ఐదో సంతకం పెట్టారు. స్కిల్‌ వర్సిటీ ఏర్పాటు అంశాన్ని ఇటీవల కడప జిల్లా మైసూరావారిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వర్సిటీ అవసరం, రాష్ట్రంలోని పరిస్థితులపై అధికారులతో ఆయన చర్చించినట్లు సమాచారం. సమగ్ర అధ్యయనం అనంతరం సీఎం దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేబినెట్‌లో చర్చించి వర్సిటీ ఏర్పాటుకు అడుగులు వేస్తే రాష్ట్రం నైపుణ్యాభివృద్ధి శిక్షణకు హబ్‌గా మారుతుందని భావిస్తున్నారు.

ఇంటింటా స్కిల్‌ సెన్సెస్‌

యువతలోని నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 15 నుంచి 59ఏళ్ల వయసున్న దాదాపు 3.5 కోట్ల మంది నైపుణ్యాలు, వారి ఆసక్తుల సమాచారం సేకరిస్తారు. ఆ తర్వాత వారి నైపుణ్యాలను పెంచడంపై దృష్టి సారిస్తారు. యువత మాత్రమే కాకుండా గృహిణులు, రైతులు, వడ్రంగి, కుమ్మరి తదితర వృత్తుల్లోని వారినీ పరిగణనలోకి తీసుకుంటారు.

దేశంలోనే మోడల్‌ వర్సిటీ

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. యువతకు అవసరమైన రంగాల్లో శిక్షణను అందిస్తారు. ఈ కేంద్రాలన్నీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్‌ వర్సిటీకి అనుబంధంగా ఉంటాయి. వీటిల్లో శిక్షణ పొందిన యువతకు ఈ వర్సిటీ ద్వారా సర్టిఫికెట్లు అందిస్తారు. అది ఉన్నవారికి ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. దేశంలోనే మోడల్‌గా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. నైపుణ్య శిక్షణ కోసం కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల చేస్తోంది. విద్యాసంస్థలకు, శిక్షణ సంస్థలకు విడివిడిగా నిధులు ఇవ్వడం వల్ల ఏదో మొక్కుబడిగా ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో ఈ కార్యక్రమం నైపుణ్య వర్సిటీ నేతృత్వంలో చేపడితే మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు ఈ వర్సిటీకి యూజీసీ గ్రాంట్లు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది.


ఉద్యోగాలున్నా నైపుణ్యం ఏదీ?

గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చిన దాఖలాల్లేవు. ఉద్యోగాల కొరత కారణంగా యువత పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సి వచ్చింది. పైగా స్థానికులకు 70 శాతం ఉద్యోగాలంటూ జగన్‌ సర్కారు తెచ్చిన చట్టం అమలు కానేలేదు. పైగా దీని దెబ్బకు కొత్తగా పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో నిపుణులైన సిబ్బంది లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యువతలో తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. ఈ పరిశ్రమలకు స్కిల్‌ వర్సిటీ మానవ వనరుల కేంద్రంగా మారే అవకాశం ఉంది.


ఏ విద్యార్హతలకైనా నైపుణ్య శిక్షణ

ఈ వర్సిటీ ద్వారా టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పూర్తి చేసినవారికి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకునే వారికి ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ సర్వీసుల్లోకి వచ్చేవారికి సైతం నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకునేలా నిబంధనలు రూపొందిస్తారు. దీంతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్‌ తదితర వృత్తి కోర్సులను కూడా చేర్చి సంపూర్ణ నైపుణ్యాభివృద్ధి వర్సిటీగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమలో ఉద్యోగం చేయాలన్నా, ప్రభుత్వ సర్వీసులో పని చేయాలన్నా ఈ వర్సిటీ నుంచి సర్టిఫికెట్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. స్కిల్‌ వర్సిటీకి కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులను కూడా వినియోగిస్తారు. పరిశ్రమల నుంచి వసూలు చేసే సెస్‌ నుంచీ నిధులు సమకూర్చుకునే అవకాశం ఉంది. శిక్షణ ఉచితమే అయినా నామమాత్రపు పీజు వసూలు చేయడం ద్వారా వర్సిటీని ఆర్థికంగా పరిపుష్ఠం చేసే యోచన కూడా ఉంది.

Updated Date - Aug 28 , 2024 | 08:59 AM

Advertising
Advertising
<