ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌కు రైతు అనే మాట ఉచ్ఛరించే అర్హత లేదు: సోమిరెడ్డి

ABN, Publish Date - Dec 15 , 2024 | 06:17 AM

రైతు ఆత్మహత్యల్లో ఏపీని మొదటి స్థానానికి తీసుకెళ్లిన ఘనత జగన్‌రెడ్డిదేనని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రైతు ఆత్మహత్యల్లో ఏపీని మొదటి స్థానానికి తీసుకెళ్లిన ఘనత జగన్‌రెడ్డిదేనని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వ్యవసాయ శాఖను చంపేసిన జగన్‌... సూక్ష్మసేద్యం, ఉచిత పోషకాలు, రాయితీల వంటి ప్రోత్సాహకాలను రైతులకు దూరం చేసిన జగన్‌... వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశాడు. దేశంలో రైతులపై తలసరి అప్పు రూ.74,500 ఉంటే, ఏపీలో రూ.2.45 లక్షల అప్పు ఉండటానికి జగనే కారణం. జగన్‌కు రైతు అనే మాట ఉచ్ఛరించే అర్హత లేదు. వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయడానికి మేం సిద్ధం. జగన్‌ సిద్ధమా? స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌లో వ్యవసాయానికి, రైతాంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారు’ అని సోమిరెడ్డి అన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 06:17 AM