Special trains: 18 నుంచి రేణిగుంట మీదుగా శబరిమలైకు ప్రత్యేక రైళ్లు
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:38 PM
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాదు, మచిలీపట్నం నుంచి కొల్లం మధ్య శబరిమలైకి ఈనెల 18 నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాదు, మచిలీపట్నం నుంచి కొల్లం మధ్య శబరిమలైకి ఈనెల 18 నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.
- మచిలీపట్నంలో ఈనెల 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు(07145-07146) మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి న్యూగుంటూరు, తెనాలి, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, కోయంబత్తూరు, పాల్‌కాడ్ మీదుగా మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లంకు చేరుకుంటాయన్నారు. కొల్లంలో ఈనెల 20, 27 తేదీల్లో తెల్లవారుజాము 2.30 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం చేరుకుంటాయని వివరించారు.
ఈ వార్తను కూడా చదవండి: AAdireddy Srinivas:ఆదిరెడ్డి భవానిపై ట్రోల్స్..ఆదిరెడ్డి వాసు వార్నింగ్
- ఈనెల 22, 29 తేదీలలో ప్రత్యేక రైళ్లు (07143, 07144) మౌలాలిలో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి చర్లపల్లి, జనగామ్, మహబూబాబాద్, డోర్నకల్లు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, గూడూరు(Dornakal, Khammam, Vijayawada, Tenali, Gudur), రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, తిరుపూరు, కోయంబత్తూరు, త్రిసూర్, అలువ, ఎర్నాకులంటౌన్, ఎట్టుమనూర్, కొట్టాయం, చెంగనచ్చేరి, తిరువళ్ల, చెంగనూరుల మీదుగా కయన్‌కుళ్లంకు మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చేరుకుంటాయి. తిరిగి ఈనెల 24, డిసెంబరు ఒకటో తేదీ కొల్లంలో అర్ధరాత్రి 2.30 గంటలకు బయలుదేరి ఇవే మార్గంలోనే వస్తాయి.
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ఓ రాబందు..
ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు
ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 16 , 2024 | 12:38 PM