Srikakulam Dist.,: శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..
ABN, Publish Date - Oct 01 , 2024 | 07:56 AM
ఆదిత్యుని విగ్రహంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఏటా రెండు సార్లు సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి.
శ్రీకాకుళం జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అరసవల్లి (Arasavalli)లో అద్బుత ఘట్టం ఆవిష్కృతమై౦ది. మంగళవారం ఉదయం సూర్య కిరణాలు (Sun Rays) అరసవల్లి ఆలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి (Sri Suryanarayana Swamy) వారి మూలవిరాట్‌ను తాకాయి. సూర్యనారాయణస్వామి పాదాల నుండి శిరస్సు వరకు లేలేత కిరణాలు తాకాయి. సుమారు 6 నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామి వారిని తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు (Devotees) భారీగా తరలివచ్చారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించి భక్తులు పరవశించిపోయారు. ఉత్తరాయణం దక్షిణాయనములో సూర్యకిరణాలు స్వామి వారి పాదాలు తాకడం ఆనవాయితీ. అక్టోబర్ 1,2 తేదీల్లోనూ.. మార్చి 9,10 తేదీలలోను స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీ.
మంగళవారం ఉదయం ఆరు గ౦టల 20 నిమిషాల సమయంలో బంగారు రంగులో లేలేత కిరణాలు సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌పై ఆరు నిమిషాల పాటు ప్రకాశించాయి. ఆలయ గోపురం నుండి గర్బ గుడిలోని స్వామివారి మూల విరాట్‌కు మధ్య దూరం 350 అడుగులు ఉంటుంది. అ౦త దూరంలో ఉన్న మూల విరాట్‌ను ఐదు ద్వార బ౦దాలు దాటుకు౦టూ సూర్య కిరణాలు నేరుగా వచ్చి తాకట౦ భక్తులు స్వామివారి మహిమగానే భావిస్తారు.ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్లి౦చే౦దుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జామున మూడు గ౦టల నుండే క్యూలైన్లలో భారులు తీరారు.
ఆదిత్యుని విగ్రహంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఏటా రెండు సార్లు సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి. అరసవిల్లి దేవాలయంలోని మూల విరాట్‌ని సూర్యకిరణాలు తాకటం ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ అద్భుత ఘట్టాన్ని కల్లారా చూసిన వారికి ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఆలయ ప్రాకారం నుండి మూడు విరాట్ కు సుమారు 350 అడుగుల దూరం ఉంటుంది. ఆలయ ప్రాకారాలను, మండపాన్ని , ద్వజ స్తంభాన్ని దాటుకొని సూర్య కిరణాలు స్వామి వారి విగ్రహంపై పడతాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధించి వారు ఆనందంగా ఉంటారనేది భక్తుల నమ్మకం. అందుకనే ఈ సుందర ఘట్టాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అరసవల్లికి తరలివస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 01 , 2024 | 07:56 AM