ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Sharmila: సామాన్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రయాణం..

ABN, Publish Date - Jan 23 , 2024 | 11:37 AM

Andhrapradesh: ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు.

శ్రీకాకుళం, జనవరి 23: ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APPCC Chief YS Sharmila) ముందుకు సాగుతున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటన సాగనుంది. తొలిరోజు ఇచ్చాపురంలో పర్యటన ప్రారంభంకావాల్సి ఉండగా.. అక్కడకు వెళ్లేందుకు షర్మిల ఆర్టీసీ బస్సును ఎంచుకున్నారు.

మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద షర్మిల ఆర్టీసీ బస్ ఎక్కారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణికులతో ఏపీసీసీ చీఫ్ ముఖాముఖి నిర్వహించారు. షర్మిలతో పాటు మాణిక్యం ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి బస్సులో ప్రయాణించారు. నేడు శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఏపీసీసీ చీఫ్ పర్యటిస్తారు.


జిల్లాల పర్యటన షెడ్యూల్ ఇదే...

  • 24న తేదీన విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లా

  • 25వ తేదీన కాకినాడ, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు

  • 26వ తేదీన తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా

  • 27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు

  • 28వ తేదీన బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

  • 29వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా

  • 30వ తేదీన శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు

  • 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 23 , 2024 | 11:37 AM

Advertising
Advertising