police fitness పోలీస్ దేహదారుఢ్య పరీక్షల్లో దళారులను నమ్మొద్దు
ABN, Publish Date - Dec 28 , 2024 | 11:31 PM
police fitness ఎచ్చెర్ల పోలీస్ గ్రౌండ్స్‌లో కాని స్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించనున్న దేహ దారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని డీఎస్పీ డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి అన్నారు.
టెక్కలి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల పోలీస్ గ్రౌండ్స్‌లో కాని స్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించనున్న దేహ దారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని డీఎస్పీ డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి అన్నారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లా డుతూ.. ఎవరైనా ఇటువంటి మోసాలకు పాల్పడితే వెంటనే తనకు సమా చారం అందించాలని, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈనెల 31న అర్ధరాత్రి జరిగే నూతన సంవత్సర వేడుకల్లో నిబంఽధనలు తప్ప నిసరిగా పాటించాలని సూచించారు. అర్ధరాత్రి దాటిన తరువాత గుంపు లుగా తిరగడం, డీజేలు పెట్టడం, బైక్‌ర్యాలీలు, మద్యపానం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు సీఐ విజయ్‌కుమార్ ఉన్నారు.
Updated Date - Dec 28 , 2024 | 11:31 PM