ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Electricity: విద్యుత్తు చార్జీలు ఒక్కపైసా పెంచలేదు

ABN, Publish Date - Dec 29 , 2024 | 12:07 AM

Electricity రాష్ట్రంలో విద్యు త్తు చార్జీలను ఒక్క పైసా కూడా కూటమి ప్రభుత్వం పెంచలేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ధ్వజమెత్తారు.

అరసవల్లి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

- ప్రజలను తప్పుతోవపట్టిస్తున్న వైసీపీ నేతలు

- శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యు త్తు చార్జీలను ఒక్క పైసా కూడా కూటమి ప్రభుత్వం పెంచలేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ధ్వజమెత్తారు. నగరంలోని స్థానిక విశాఖ-ఏ కాలనీలో గల తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలకు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు బాధలు అనుభవిస్తున్నారన్నారు. వైసీపీ తప్పుడు విధానాల వలన విద్యుత్తు రంగంపై రూ.1.29 లక్షల కోట్లు ప్రజలపై భారం పడిందన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేసే పని ఇంకెంత కాలం చేస్తారని వైసీపీ నాయకుల ను ఆయన ప్రశ్నించారు. విద్యుత్తు రెగ్యులేటరీ కమిటీ చెప్పిన దాని కంటే ఎక్కువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేసారని, దాని ఫలితమే ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్‌ చార్జీలువేయడం జరుగుతోందని, ఇది జగన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన బహుమ తేనని అన్నారు. సూర్యఘర్‌ పథకం ద్వారా సౌర విద్యుత్తు వినియోగించు కోవాల ని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీర రమణయ్య, పాండ్రంకి శంకర్‌, చిట్టి మోహన్‌, ఎండు చిన్నారావు, పంచిరెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో పలువురు చేరిక

రాష్ట్రంలో సం క్షేమం, అభివృద్ధి సమాంతరంగా జరుగుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. రాగోలుకు చెందిన పలువురు తన క్యాంపు కార్యాలయంలో శనివారం పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే పార్టీలోకి సాదారంగా ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల బాధలకు అంతులేకుండా పో యిందని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు. నాయకులను, కార్య కర్తలను ఎంతో గౌరవించే పార్టీ టీడీపీ అని, అందుకే స్వచ్ఛందంగా ప్రజలు పార్టీలోకి వస్తున్నారన్నారు. కార్యక్ర మంలో చల్లా రాజా వెంకటరమణ బాబు, చల్లా గోవిం దరావు, చల్లా రూపచంద్రశేఖర్‌, కూటికుప్పల సురేష్‌బాబు తదితరులు పార్టీలో చేరారు.

చార్జీలు పెంచేసి.. ధర్నాలు చేయడం సిగ్గుచేటు

- ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌

కవిటి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ చా ర్జీలను పెంచిన వైసీపీ నాయకులు ఇప్పుడు ధర్నాలు చేయ డం సిగ్గుచేటని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్‌ బెందాళం అశోక్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ హయాంలో విద్యుత్‌ సంస్థలపై రూ.49వేల కోట్లు అప్పుచేసినా కొత్త విద్యుత్‌ ప్లాంటును ఏర్పాటు చేయలేదన్నారు. నిర్మాణంలో ఉన్న కృష్ణపట్నం, వీటీ పీఎస్‌లను సకాలంలో ప్రారంభించలేదన్నారు. దీంతో విద్యుత్‌ కొరతను సృష్టించి కమీషన్లు కోసం బహిరంగ మార్కెట్‌లో అధిక రేట్లకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్లే రూ.2700 కోట్లు నష్టం వచ్చిందన్నారు. అంతేకాక విద్యుత్‌ మీటర్లు, ట్రా న్స్‌ఫార్మర్స్‌ వంటి విద్యుత్‌ పరికరాలును కమీషన్లు కోసం అధికరేట్లకు కొనుగోలు చేయడంతో రాష్ట్రానికి కోట్లలో నష్టం వాటిల్లిందన్నారు. ఇలా విద్యుత్‌ సంస్థలను నిర్వీర్యం చేసి ట్రూ అప్‌ చార్జీలపేరిట వినియోగదారులపై భారం వేసిన జగన్‌రెడ్డి ఇప్పుడు ధర్నాలు చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు.

వైసీపీ ధర్నాలు హాస్యాస్పదం

కవిటి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో విద్యుత్‌ చార్జీల భారం ప్రజలపై మోపి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఆ పార్టీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లోళ్ల రాజేష్‌ విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు అసత్యప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుతోవ పట్టించేందుకు చూస్తున్నారని, దీన్ని కూటమి నేతలు తిప్పికొటాలన్నారు. జగన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:07 AM