అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
ABN, Publish Date - Dec 20 , 2024 | 12:18 AM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాల నాయకు లు డిమాండ్ చేశారు.
అరసవల్లి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాల నాయకు లు డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ను అవమానిస్తూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులు గురువారం నిరసన తెలిపారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్ర మంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.సింహాచలం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, రైతు సంఘం కార్యదర్శి కె.మోహన రావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, ఉపాఽధ్యక్షుడు కె.అప్పారావు, ఐద్వా జిల్లా కన్వీనర్ అల్లా డ లక్ష్మి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి తదితరులు పాల్గొన్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు స్థానిక పీఎస్‌ఎన్‌ఎం మిల్లు జంక్షన్‌లో నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రెల్ల సురేష్, కేవీఎల్‌ఎస్ ఈశ్వరి, అంబటి దాలినాయుడు, కొత్తపల్లి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- ఆమదాలవలస, డిసెంబరు 19(ఆంధ్రజ్యో తి): మునగవలస గ్రామం లో అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయ కులు గురువారం నిరసన తెలిపారు. తక్షణమే అమి త్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డి మాండ్ చేశారు. కార్యక్ర మంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బొత్స వెంక టరమణ, నాయకులు గొల్లపల్లి దాలయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- టెక్కలి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): కేంద్ర మం త్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక అంబేడ్క ర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. దళిత సంఘాల జేఏసీ నాయకులు బోకర నారాయణరావు, చల్లా రామారావు, కురమాన దాలయ్య, తాతారావు తదితరులు పాల్గొన్నారు.
- కొత్తూరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ మండ ల కేంద్రం కొత్తూరులో వ్యవసాయ కార్మిక సంఘం, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేప ట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శిర్ల ప్రసాద్, బి.నగేష్, కె.మిన్నారావు, పి.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
- జలుమూరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై పార్లమెం ట్‌లో అనుచిత వ్యాఖలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీరును నిరిసిస్తూ గురువారం లింగాలవలస కాలనీలో గల అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మామిడి సత్యనారాయణ, నాయకులు భేరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 12:18 AM