ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిట్టుబాటు ధర కల్పించండి

ABN, Publish Date - Dec 23 , 2024 | 12:10 AM

సరుగుడు, నీలగిరికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సరుగుడు, నీలగిరి రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బస్వ గురుమూర్తిరెడ్డి, ఉపాధ్యక్షుడు గాలి వెంకటరెడ్డిలు కోరారు.

మాట్లాడుతున్న సంఘం జిల్లా అధ్యక్షుడు బస్వా గురుమూర్తిరెడ్డి

ఎచ్చెర్ల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సరుగుడు, నీలగిరికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సరుగుడు, నీలగిరి రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బస్వ గురుమూర్తిరెడ్డి, ఉపాధ్యక్షుడు గాలి వెంకటరెడ్డిలు కోరారు. మండలం కేశవరావుపేట జంక్షన్‌కు సమీపంలో జిల్లాకు చెందిన సరుగుడు, నీలగిరి రైతులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో సరుగుడు, నీలగిరి తోటల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వారంతా గిట్టుబాటు ధర సమకూరక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా నుంచి సరుగుడు, నీలగిరిని జేకే పేపర్‌మిలు ్ల(రాయఘడ), ఏపీ పేపర్‌ మిల్లు (రాజమండ్రి), ఐటీసీ పేపర్‌ మిల్లు (భద్రాచలం)కు ఎగుమవుతోందన్నారు. ఈ ఏడాది డిసెంబరు 10 వరకు 18 అడుగులు ఉండే సరుగుడు కర్రల టన్ను రూ.9,200లకు కొనుగోలు చేసేవారన్నారు. ఇదే కొలతల కర్రలను ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదని, మిల్లర్ల చుట్టూ తిరిగితే ఐదారు వేలకు మించి కొనుగోలు చేయడంలేదన్నారు. ఒక్కసారిగా ధర తగ్గిపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారన్నారు. నీలగిరి కర్రలు టన్ను రూ. 8 వేలు ఉండగా, దాన్ని రూ.500 తగ్గించారని, ఈ ధర మరింత తగ్గుతుందని మిల్లర్లు చెబుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సరుగుడు, నీలగిరికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. సమావేశంలో బి.రాంబాబు, ఆరేళ్ల కృష్ణ, పైడిపెద్ది పూర్ణచంద్రరావు, అలుపన సింహాచలం, బగ్గు శ్రీను, ఎన్‌.రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 12:10 AM