పనితీరు మెరుగుపరుచుకోవాలి: ఆర్డీవో
ABN, Publish Date - Dec 19 , 2024 | 11:56 PM
క్షేత్ర స్థాయిలో అధికారులు పనితీరు మెరుగుపరు చుకోవాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి కోరారు. గృహనిర్మాణశాఖ లక్ష్యాలను వేగవంతంగా అమలు చేయాలని తెలిపారు.
టెక్కలి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): క్షేత్ర స్థాయిలో అధికారులు పనితీరు మెరుగుపరు చుకోవాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి కోరారు. గృహనిర్మాణశాఖ లక్ష్యాలను వేగవంతంగా అమలు చేయాలని తెలిపారు. గురువారం టెక్కలి సబ్‌కలెక్టరేట్‌లో డివిజన్ స్థాయి ప్రత్యే కాధికారులు, మండల ప్రత్యేకాధికారులు, గృహ నిర్మాణశాఖ సిబ్బందితో సమీక్షించారు. టెక్కలి డివిజన్‌లో 242 ఇళ్ల కాలనీ లేఅవుట్లలో వేగవంతంగా నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ అన్నదొర పాల్గొన్నారు.
Updated Date - Dec 19 , 2024 | 11:56 PM