ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:12 AM
Private School Teacher Commits Suicide ఎచ్చెర్లలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గనగళ్ల నీరజ(22) బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది.
ఎచ్చెర్ల/గార, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్లలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గనగళ్ల నీరజ(22) బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ వి.సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం కళింగపట్నం పంచా యతీ నగరాలపేట గ్రామానికి చెందిన నీరజ ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్‌లో అసోసియేట్ టీచర్‌గా పనిచేస్తోంది. ఈమె అక్క హేమలత కూడా ఇదే పాఠశాలలోనే రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నారు. వీరిద్ద రూ స్కూల్ కాంపౌండ్‌లోని వసతి గృహంలోనే ఉంటున్నారు. బుధవారం క్రిస్మస్ కారణంగా పాఠశాలకు సెలవు కావడంతో నీరజ తన గదిలోనే ఉండగా, హేమలత విధులకు హాజరైంది. వీరిద్దరూ మధ్యాహ్న భోజన సమయంలో కొద్ది సేపు మాట్లాడు కోగా, అక్క తిరిగి విధుల్లోకి వెళ్లింది. నీరజ మాత్రం తాను ఉంటున్న గదికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏమైందోగాని నీరజ తన గదిలోనే ఉన్న ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హేమలత విధులు ముగించుకుని సాయంత్రం ఆరు గంటల సమయంలో రూమ్‌కి చేరుకుని తలుపులు కొట్టి నా ఎంతసేపటికీ నీరజ తలుపులు తీయలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్‌చేయలేదు. దీంతో తలుపు గడియ సందులోంచి చూడగా నీరజ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో హేమలత కేక లు వేయగా.. క్యాంపస్‌లోని వాళ్లు అక్కడికి చేరకుని నీరజ మెడకు ఉన్న చున్నీని తప్పించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో.. ఆమె స్వగ్రామంలోని తాత, నాన్నమ్మలకు హేమ లత సమాచారం ఇచ్చింది. రాత్రికి రాత్రే మృతదేహాన్ని నగరాల పేటకు చేర్చడంతో.. అక్కడి బంధువులు, గ్రామస్థులు అడ్డుకుని, ఏమి జరిగిందో తెలియాలని పట్టుబట్టారు. దీంతో గార పోలీ సులకు బుధవారం అర్ధరాత్రి సమాచారం అందించారు. గురువా రం వేకువ జామున గార పోలీసులు నగరాలపేట చేరుకుని జరి గిన ఘటన వివరాలు సేకరించి, ఎచ్చెర్ల పోలీసులకు సమాచా రం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. అయితే నీరజ మృతి పట్ల తల్లిదండ్రులు కొండమ్మ, రాంబాబు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ సందీప్‌కుమార్ తెలిపారు.
Updated Date - Dec 27 , 2024 | 12:13 AM