అంబేడ్కర్ వర్సిటీకి రూ.20కోట్లు మంజూరు
ABN, Publish Date - Dec 22 , 2024 | 11:56 PM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి కేంద్ర విద్యాశాఖ పీఎం ఉషా(ప్రధానమంత్రి ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) రూ.20 కోట్లను మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.
ఎచ్చెర్ల, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి కేంద్ర విద్యాశాఖ పీఎం ఉషా(ప్రధానమంత్రి ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) రూ.20 కోట్లను మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 61 యూనివర్సిటీలకు నిధులు మంజూరుచేయగా, రెండో విడతగా 12 యూనివర్సిటీలకు నిధులు కేటాయించింది. ఇందులో అంబేడ్కర్ యూనివర్సిటీకి చోటు దక్కడంతో అభివృద్ధికి మార్గం సుగుమమైంది. పీఎం ఉషాకు అప్పటి వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు హయాంలో ప్రతిపాదనలు పంపారు. రానున్న ఐదేళ్లలో ఈ నిధులు విడతల వారీగా విడుదల చేస్తారు. కొత్తగా భవనాల నిర్మాణం, పాతవాటిని మెరుగుపర్చడం తదితర మౌలిక సదుపాయాలు కల్పనకు వీటిని వినియోగిస్తారు. అలాగే వివిధ కోర్సుల ల్యాబ్‌ల అభివృద్ధి, విద్యార్థుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేలా సర్టిఫికెట్ కోర్సుల శిక్షణ, వర్క్‌షాపు, సెమినార్‌ల నిర్వహణకు ఈ నిధులను వెచ్చిస్తారు. వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఈ వర్సిటీకి రెండో విడతలో ప్రాధాన్యం దక్కింది.
Updated Date - Dec 22 , 2024 | 11:56 PM