పోరాటాలకు స్ఫూర్తి సుబ్బారావు పాణిగ్రాహి
ABN, Publish Date - Dec 22 , 2024 | 11:53 PM
విప్లవ పోరాటాలకు స్ఫూర్తి సుబ్బారావు పాణిగ్రాహి అని పలు సంఘాల నేతలు అన్నారు.
పలాసరూరల్/హరిపురం/నరసన్నపేట, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): విప్లవ పోరాటాలకు స్ఫూర్తి సుబ్బారావు పాణిగ్రాహి అని పలు సంఘాల నేతలు అన్నారు. విప్లవ కవి, శ్రీకాకుళోద్యమంలో కీలకపాత్ర పోషించిన సుబ్బారావు పాణిగ్రాహి 55వ వర్ధంతిని పలాస మండలం బొడ్డపాడు, మందస మండలం రట్టి, నరసన్నపేట మండలం కోమర్తి గ్రామాల్లో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. బొడ్డపాడులో అమరవీరుల బంధు మిత్రుల సంఘం ఉభయ రాష్ట్రాల అధ్యక్షు రాలు పద్మకుమారి, జాతీయ మూఢనమ్మకాల నిర్మూలనా సంఘం అధ్యక్షుడు బైరి నరేష్, ప్రజా కళా మండలి రాష్ట్ర సహాయకార్యదర్శి కొర్రాయి నీలకంఠం, రట్టి గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మామిడి భీమా రావు, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు నేతింటి నీలం రాజు మాట్లాడుతూ విప్లవ పోరాటానికి ఆయన చేసిన సేవలను కొని యాడారు. ప్రజల సమస్యలపై చేసిన పోరాటంలో సుబ్బారావు పాణి గ్రాహి రాసిన పాటలు తూటాలుగా పేలాయని, ఇప్పటికీ మారు మోగుతూనే ఉన్నాయన్నారు. 1969 శ్రీకాకుళం సాయుధ పోరాటంలో గన్ను, పెన్ను రెండింటికి సమన్యాయం చేసి పోరా టాలను ముందుకు తీసుకెళ్లి ప్రజల కోసం అశువులు బాసిన వ్యక్తి సుబ్బారావు పాణి గ్రాహి అని వక్తలు కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో కళాకారులు గీతాలను ఆలపించారు. కార్యక్రమాల్లో ఆయా సంఘాల ప్రతినిధులు సొర్ర రామారావు, జుత్తు వీరాస్వామి, ఎం. వినోద్, సవర బంగ్లా కుమార్, పొదిలాపు దాలినాయుడు, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బగ్గు భాస్కరరావు, మామిడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 11:53 PM