ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమయం లేదు మిత్రమా.. దోచేద్దాం!

ABN, Publish Date - Oct 11 , 2024 | 03:15 AM

‘ఐదారు రోజుల్లో ప్రైవేటు షాపులు వచ్చేస్తున్నాయి. మన ఉద్యోగాలు ఊడిపోతాయి. దొరికినకాడికి దోచేయడమే ఇప్పుడు మన పని’.. అని అనుకుంటున్నారు ప్రభుత్వ మద్యం షాపుల సిబ్బంది.

  • మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు

  • క్వార్టర్‌ సీసాపై రూ.10-20 అదనం

  • ఉద్యోగాలు పోతున్నాయంటూ కలెక్షన్‌

  • పాలసీ హడావుడిలో ఎక్సైజ్‌ శాఖ

  • పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యం

  • అర్ధరూపాయి పెరిగినా రూ.10 భారం

అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ‘ఐదారు రోజుల్లో ప్రైవేటు షాపులు వచ్చేస్తున్నాయి. మన ఉద్యోగాలు ఊడిపోతాయి. దొరికినకాడికి దోచేయడమే ఇప్పుడు మన పని’.. అని అనుకుంటున్నారు ప్రభుత్వ మద్యం షాపుల సిబ్బంది. దీంతో రాష్ట్రంలోని చాలా మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. పట్టణాల్లో క్వార్టర్‌ సీసాపై రూ.10, ఫుల్‌ బాటిల్‌పై రూ.40 చొప్పున అదనంగా తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్వార్టర్‌పై రూ.20 వసూలు చేస్తున్నారు. గతంలో ఇలా వసూలుచేస్తే ఉద్యోగం పోతుందనే భయం ఉండేది.

ఇప్పుడు ఎలాగూ ఉద్యోగం పోతున్నదనే ఉద్దేశంతో సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలతోపాటు బెల్టు షాపులకు అడిగినంత మద్యం పంపుతున్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలతో సేల్స్‌మెన్‌ జేబులు నింపుకొంటున్నారు. నూతన మద్యం పాలసీని ప్రభుత్వం సెప్టెంబరు 30న ప్రకటించింది. మరుసటి రోజు నుంచే చాలాచోట్ల అదనపు వసూళ్లు ప్రారంభమయ్యాయి. రానురానూ ఇవి మరింత పెరిగిపోయాయి.

ప్రభుత్వం ప్రైవేటు మద్యం షాపుల పాలసీని ప్రకటించిన తర్వాత సిబ్బంది ఒక రోజు షాపులు బంద్‌ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సంఘం నాయకులతో ఉన్నతాధికారులు చర్చలు జరిపి, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ఈ నెల 15 వరకు విక్రయాలు కొనసాగించాలని కోరారు. ఈలోపు సిబ్బంది ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నా ఏమీ అనలేని పరిస్థితి. చర్యలు తీసుకుంటే అమ్మకాలు ఆగిపోతాయనే ఆందోళనలో ఎక్సైజ్‌ శాఖ ఉంది.


  • అధికారుల పర్యవేక్షణ లోపం

జగన్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం షాపుల విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్లో వైసీపీకి అనుకూలంగా ఉండేవారిని తీసుకొచ్చి షాపుల్లో నియమించారు. జీతం కూడా మరీ తక్కువ కాకుండా సేల్స్‌మెన్‌కు రూ.18,500, సూపర్‌వైజర్‌కు రూ.21,500 ఇస్తున్నారు. మంచి జీతాలు ఇస్తున్నప్పటికీ పలుచోట్ల ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్లు అందుబాటులో లేకపోవడాన్ని కూడా ఆదాయంగా మార్చుకున్నారు. అరకొరగా వచ్చిన మంచి బ్రాండ్ల మద్యాన్ని ప్రైవేటుగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. పైగా ప్రస్తుతం ప్రభుత్వ షాపులపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. దీంతో ఇంకా నాలుగైదు రోజులే ఉద్యోగం అంటూ సేల్స్‌మెన్‌ ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు.

Updated Date - Oct 11 , 2024 | 03:16 AM