ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : పెన్షన్‌ అనర్హులకు నోటీసులు

ABN, Publish Date - Dec 18 , 2024 | 03:34 AM

రాష్ట్రంలో అర్హత లేని వారికి సామాజిక భద్రతా పింఛన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • వివరణ బాగుంటే కొనసాగింపు.. లేకపోతే భరోసా పింఛన్ల రద్దు

  • అధికారులకు సెర్ప్‌ సీఈవో ఆదేశాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది అనర్హులు ఉన్నట్టు సర్కారు అంచనా

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హత లేని వారికి సామాజిక భద్రతా పింఛన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఉన్నట్టుండి రద్దు చేయకుండా అనర్హులుగా గుర్తించిన వారికి తొలుత నోటీసులు ఇచ్చి, వారి నుంచి వివరణ తీసుకోనున్నారు. లబ్ధిదారులు ఇచ్చే వివరణ ఆమోదయోగ్యంగా ఉంటే వారికి పింఛన్‌ను కొనసాగిస్తారు. లేకపోతే రద్దు చేయనున్నారు. ఈ మేరకు సెర్ప్‌ సీఈవో వీరపాండ్యన్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు సూచించారు. అనర్హులుగా గుర్తించిన పింఛనుదారులకు తొలుత నోటీసులివ్వాలని, తగు అర్హతలు నిరూపించలేకపోతేనే పెన్షన్లను రద్దు చేయాలని స్పష్టం చేశారు. నోటీసులకు సకాలంలో సమాధానాలు ఇవ్వలేకపోతే పెన్షన్లను హోల్డ్‌లో ఉంచాలని పేర్కొన్నారు. ఇటీవల అనర్హుల పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్‌ సర్వే నిర్వహించింది. జిల్లాకొక సచివాలయ పరిధిలో సర్వే నిర్వహించగా 563 మంది(5 శాతం) అనర్హులు పెన్షన్‌ పొందుతున్నారని తేలింది. ఆయా అనర్హుల పెన్షన్లు వెంటనే ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్ల లాగిన్‌ నుంచి తొలగించి పెన్షన్లు నిలిపేయాలని ఇప్పటికే ఆదేశించారు.


ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది దాకా అనర్హులున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని సచివాలయాల పరిధిలో సర్వే చేసి అనర్హుల పెన్షన్లను తొలగించాలని వీరపాండ్యన్‌ సూచించారు. తప్పుడు సదరం సర్టిఫికెట్లు, డాక్టర్ల నుంచి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యల పేరుతో పెన్షన్లను పొందుతున్నారని.. అలాంటి వారి సర్టిఫికెట్లను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. ఇదిలావుంటే, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ఈ విషయంపై సీరియ్‌సగా స్పందించిన విషయం తెలిసిందే. అనర్హులు దొడ్డిదారిలో పెన్షన్‌ పొందుతున్నందున అసలైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే అనర్హులు పెన్షన్లు పొందుతుండడంతో కొత్తగా మరికొందరు కూడా ఇదే దారిలో పింఛన్ల కోసం నేతలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అర్హులకు మాత్రమే పింఛన్లను అందించడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

Updated Date - Dec 18 , 2024 | 03:34 AM