ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

State-level Kabaddi : అట్టహాసంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ABN, Publish Date - Oct 29 , 2024 | 11:16 PM

రాష్ట్ర ప్రభుత్వం ఆదే శాల మేరకు పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడ రేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో అట్టహాసంగా సాగిన అండర్‌-17 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ముగిశాయి.

అండర్‌-17 కబడ్డీ బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచిన చిత్తూరు జట్టు

రాష్ట్ర స్థాయిలో బాలుర విజేత కడప ఫ బాలికల విజేత చిత్తూరు జట్టు

రాయచోటిటౌన్‌, అక్టోబరు29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదే శాల మేరకు పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడ రేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో అట్టహాసంగా సాగిన అండర్‌-17 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ముగిశాయి. కబడ్డీపోటీల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమానికి హాజరైన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సోదరుడు, టీడీపీ యువనేత డాక్టర్‌ మండి పల్లి లక్ష్మిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. తమ సోదరుడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సహకారంతో పట్టణంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఐపీఈ భానుమూర్తిరాజు మాట్లాడుతూ అండర్‌-17 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు రాయచోటి ఆతిధ్యం ఇవ్వడం ఆనందంగా ఉంద న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన 26 జట్ల బాల బాలికల క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర స్థాయికి ఎంపికకావడం సంతోషంగా ఉందన్నారు.


డీఈఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ విద్యార్థులకు చదు వే కాకుండా క్రీడలు కూడా చాలా అవసరం అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం ఏర్పడుతుందన్నారు.

అనంతరం బాలుర విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన కడప జిల్లా జట్టుకు రూ.25 వేలు, బాలికల విభాగం మొదటి స్థానంలో నిలిచిన చిత్తూరు జిల్లా జట్టుకు రూ.25 వేలు, బాలుర విభాగం రెండో స్థానంలో నిలిచిన అనంతపురం జట్టుకు రూ.15 వేలు, బాలికల విభాగం రెండో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం జట్టుకు రూ.15 వేలు, బాలుర విభాగంలో మూడో స్థానంలో నిలిచిన కర్నూలు జట్టుకు రూ.10 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన చిత్తూరు జట్టుకు రూ.10 వేలు, బాలికల విభాగంలో మూడో స్థానంలో నిలిచిన అనం తపురం జిల్లా జట్టుకు రూ.10 వేలు, కృష్ణా జిల్లా జట్టుకు రూ.10 వేలు చొప్పున నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేసి అభినం దించారు. కార్యక్రమంలో స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీలు వసంత, అరుణ కుమారి, కబడ్డీ పోటీల ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వీరాంజనేయులు, ఉపాధ్యాయ సంఘం చీఫ్‌ పాటర్న్‌ నరసరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాష్ట్ర జట్టుకు ఎంపికైన బాలబాలికలు వీరే

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో మూడు రోజులు పాటు జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జట్లకు బాలబాలికలను ఎంపిక చేశారు. ఈ జట్లు మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయి.


బాలుర జట్టు: నూర్‌బాషా, బ్రహ్మయ్య, మద్దిలేటి స్వామి (కడ ప), విష్ణు (అనంతపురం), ఎన్‌ఎస్‌జాన్‌ పీటర్‌ (చిత్తూరు), బటీ గుర్రప్ప (కర్నూల్‌), రామకృష్ణ (ప్రకాశం), పవన్‌కల్యాణ్‌ రెడ్డి(గుంటూరు), బీహెచ్‌ తీషిత్‌ (కృష్ణ), గంగరాజు (విజయనగ రం), సోమేశ్‌ (ప్రకాశం), దామోదర్‌నాయుడు (కడప), లీలాధర్‌ (కర్నూలు), సందీప్‌ (చిత్తూరు).

బాలికల జట్టు: లిఖత, సనా (చిత్తూరు), యమున (శ్రీకాకుళం), అర్చన (శ్రీకాకుళం), హిమజ, నవ్య(అనంతపురం), కీర్తన (కృష్ణ), శిరీష (కర్నూలు), దేవికాబాయి (గుంటూరు), లక్ష్మిదేవి (విజయ నగరం), దివ్య(విశాఖపట్నం), రెడ్డికావ్యశ్రీ (కడప), త్రిపుర (ప్రకాశం), జ్యోతి (కృష్ణ), పల్లవి (చిత్తూరు).

Updated Date - Oct 29 , 2024 | 11:16 PM