కోనోకార్పస్ చెట్ల నరికివేతను నిలువరించండి
ABN , Publish Date - Aug 27 , 2024 | 04:09 AM
మానవాళికి, పర్యావరణానికి హానికరమని శాస్త్రీయంగా నిరూపితమయ్యేవరకు కోనోకార్పస్ చెట్ల నరికివేతను నిలుపుదల చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

హైకోర్టులో పిల్ దాఖలు
అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మానవాళికి, పర్యావరణానికి హానికరమని శాస్త్రీయంగా నిరూపితమయ్యేవరకు కోనోకార్పస్ చెట్ల నరికివేతను నిలుపుదల చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గుంటూరుకు చెందిన వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మరో ఇద్దరు ఈ పిల్ దాఖలు చేశారు. కోనోకార్పస్ మొక్కలు నాటడం మంచిదా కాదా అనే విషయంపై అధ్యయనానికి నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశాలివ్వాలని కోరారు. చట్టవిరుద్ధంగా ఎవరైనా ఆ చెట్లను నరికివేస్తే వాల్టా చట్ట ప్రకారం నష్టపరిహారం వసూలు చేసి ఆ సొమ్ముతో తిరిగి చెట్లను నాటేలా ఆదేశించాలని కోరారు. పిల్ పరిష్కారమయ్యేవరకు రాష్ట్ర వ్యాప్తంగా కోనోకార్పస్ చెట్లను నరికివేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సీఎస్, పర్యావరణం-అడవులు, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్‌లు, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, కాకినాడ, నెల్లూరు కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు.