ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Students $విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

ABN, Publish Date - Sep 17 , 2024 | 11:52 PM

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి సూచించారు.

విద్యార్థులకు స్కూల్‌ కిట్స్‌ పంపిణీ చేస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటిటౌన, సెప్టెంబరు17: విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన పట్టణంలోని అలీమాబాద్‌ వీధిలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం దుస్తులు, విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాటా ్లడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమాజ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతో పాటు వినయం, విధేయత, సంస్కారం, మానవతా విలువలను కూడా నేర్పించాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి విధ్యనభ్యసించి తమ తల్లిదండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసు కురావాలన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించా లని, క్రీడల్లో రాణించడం వల్ల విద్య ఉద్యోగాల్లో వారికి మొదటి ప్రాధాన్యం లభిస్తుందన్నారు. ఉర్దూ పాఠశాల లో క్రీడాపరికరాల కొనుగోలు తన సొంత నిధుల నుంచి రూ.50 వేలు ఇస్తానన్నారు. ఉర్దూ పాఠశాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన చెన్నూరు అన్వర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

సచివాలయ సిబ్బంది మెరుగైన సేవలందించాలి

సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని ఎగువ అబ్బవరంలో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. జాప్యం లేకుండా పారదర్శకంగా సేవలందించాలని, అప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లిని ఎగువ అబ్బవరం గ్రామ ప్రజలు గజమాలతో ఘనంగా సన్మానించారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

చిన్నమండెం: మండలంలోని కలిబండ హరిజనవాడలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి నూతన బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజులకే రాయచోటి నియోజకవర్గంలో దాదాపు 56 బోర్లు వేశామన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 11:52 PM

Advertising
Advertising