ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

ABN, Publish Date - May 08 , 2024 | 03:44 PM

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ క్యాట్ (Central Administrative Tribunal) ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయడంతో క్యాట్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే వాదనలు పూర్తవ్వగా తీర్పును రిజర్వ్ చేసిన క్యాట్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ క్యాట్ (Central Administrative Tribunal) ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయడంతో క్యాట్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే వాదనలు పూర్తవ్వగా తీర్పును రిజర్వ్ చేసిన క్యాట్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరారవును రెండోసారి సస్పెండ్ చేయడం న్యాయ విరుద్దమని క్యాట్ వ్యాఖ్యానించింది.


తక్షణమే ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకుని ఆయనకు రావాల్సిన ఎరియర్స్ మొత్తం ఇవ్వాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సస్పెన్షన్ చట్ట విరుద్దమని, ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.


ఇది విషయం

గత ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కోసం తన కుమారుడికి చెందిన సంస్థకు ఏబీ వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్ ఇప్పించారు. కొనుగోలు అంశంపై గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా వినిపించుకోలేదు. 2019లో వైసీపీ అధికారం చేపట్టడంతో ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి జగన్ సర్కార్ తప్పించింది. 9 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. నిఘా పరికరాల వ్యవహారం, ఇజ్రాయెల్‌కు రహస్యాలు చెరవేశారని కేసు నమోదు చేసి విధుల నుంచి తప్పించింది. దాంతో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. తొలిసారి క్యాట్, కేంద్ర హోంశాఖలో కూడా ఊరట కలుగలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. బాధ్యతలు చేపట్టే సమయంలో మరోసారి ఏపీ సర్కార్ సస్పెండ్ చేసింది. దానిపై మరోసారి క్యాట్‌ను ఆశ్రయించగా విచారించింది. బుధవారం నాడు ఏబీవీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

చేతులు కలిపిన కేసీఆర్, జగన్..

YSRCP: అర్ధరాత్రి కవ్వింపు చర్యలు.. టీడీపీ నేతలపై వైసీపీ మూకల దాడి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2024 | 04:00 PM

Advertising
Advertising