మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andhra Pradesh: గవర్నర్ కు చంద్రబాబు లేఖ.. వారిపై చర్యలు తీసుకోవాలని వినతి..

ABN, Publish Date - Mar 01 , 2024 | 03:58 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ..

Andhra Pradesh: గవర్నర్ కు చంద్రబాబు లేఖ.. వారిపై చర్యలు తీసుకోవాలని వినతి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ.. అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీఎస్ఆర్డీఆర్ఐ దుర్వినియోగాన్ని లేఖలో తెలిపారు. ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఏపీఎస్ఆర్డీఆర్ఐను ప్రతిపక్షాలను వేధించేందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్‌గా నియమించుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఈ విభాగం ద్వారా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను కేసులో ఇరికించి అరెస్టు చేశారు. శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. అయినా ఏపీఎస్ఆర్డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ సీతారామ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోంది. కేవలం టీడీపీ నేతలను వేధించడమే ఏపీఎస్ఆర్డీఆర్ఐ పనా?.. ఏపీఎస్ఆర్డీఆర్ఐ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేసింది?" అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.


ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తోంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏపీఎస్డీఆర్ఐ ద్వారా ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే కుట్ర చేస్తోంది. వారి వేధింపులు భరించలేక పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అధికారం దుర్వినియోగం చేసే ప్రభుత్వ చర్యను నిలువరించాలని కోరుతున్నా.

- గవర్నర్ కు రాసిన లేఖలో చంద్రబాబు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 04:41 PM

Advertising
Advertising