varla ramaiah: వైసీపీ పాటలకు ఆ సీఐ స్టెపులు వేస్తారు
ABN, Publish Date - Apr 19 , 2024 | 07:39 PM
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పలువురు పోలీసుల వ్యవహార శైలిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో ఎంకే మీనాను శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అందుకు సంబంధించిన వివరాలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వివరించారు.
అమరావతి, ఏప్రిల్ 19: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పలువురు పోలీసుల వ్యవహార శైలిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో ఎంకే మీనాను శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అందుకు సంబంధించిన వివరాలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వివరించారు.
చిత్తూరు జిల్లాలో సీఐగా గంగిరెడ్డి విధులు నిర్వహిస్తు న్నారన్నారు. ఆయన మంత్రి పెద్దిరెడ్డి కూర్చోమంటే.. కూర్చుంటారు.. నుంచోమంటే నుంచుంటారని చెప్పారు. అయితే సదరు సీఐకు అయిదు ఏళ్ల పదవి కాలం పూర్తి అయిందని.. బదిలీ చేశారని చెప్పారు. కానీ మళ్లీ అదే జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్‌కు ఆయన దొడ్డి దారిలో వచ్చారని వివరించారు. అతడిపై తక్షణం బదిలీ వేటు వేయాలని సీఈవోను కోరినట్లు చెప్పారు.
ఇక ఒంగోలులోని సీఐలు ఎం లక్ష్మణ్, భక్తవత్సలరెడ్డిలపై ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సిఐ భక్తవత్సల రెడ్డీ గతంలో మాచర్లలో పని చేశారని గుర్తు చేశారు.
మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిప్పుడు సీఐగా ఆయన అక్కడే ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో భక్తవత్సల రెడ్డిని శాంతి భద్రతల విభాగం నుంచి తప్పించాలని కోరామని వెల్లడించారు. ఇక సీఐ లక్ష్మణ్ అయితే వైసీపీ పాటలు వస్తే డ్యాన్స్ చేస్తారన్నారు. స్థానిక ఎమ్మెల్యేకే కాదు.. ఆయన కుమారుడికి సైతం సెల్యూట్ చేస్తారని వ్యంగ్యంగా అన్నారు.
ఇలాంటి వ్యక్తులు ఎన్నికల విధుల్లో ఉంటే ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా ఎలా జరుగుతాయని సీఈవో ఎదుట సందేహం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఇక మే 13వ తేదీన విట్, ఎస్ఆర్ఎం కాలేజీలకు సంబంధించి తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహింస్తున్నారన్నారు. అయితే ఈ పరీక్షలను మరో రోజుకు వాయిదా వేయాలని సీఈవోను కోరినట్లు చెప్పారు.
ఇక నగరిలో మంత్రి ఆర్కే రోజాకు మద్దతుగా ఇద్దరు రైల్వే ఉద్యోగులు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వారిని సస్పెండ్ చేయాలని కూడా విజ్జప్తి చేసినట్లు వివరించారు. పొన్నూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీ కోసం సాక్షిలో ప్రచురితమైన కథనం, పెయిడ్ ఆర్టికల్‌గా పరిగణించాలని కోరామన్నారు.
AP Elections: టీడీపీలో చేరిన వాలంటీర్లు
ఈ మొత్తాన్ని మురళీ ఎన్నికల వ్యయంగా పరిగణించాలని కోరినట్లు తెలిపారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అలాంటి వేళ పోస్టల్ బ్యాలెట్‌పై ఇంకా క్లారిటీ లేదని.. దీనిపై వెంటనే క్లారిటీ ఇవ్వాలని కోరామన్నారు. ఇక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై దాడి చేశారంటూ సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్పారు.
కానీ ఆ కేసులో 307 అప్లై కూడా అవ్వదన్నారు. దీనిపై అప్లీల్ చేస్తే.. మీ బిడ్డ బయటకు వస్తారని చెప్పినట్లు వర్ల రామయ్య వివరించారు. అయితే సీఎం వైయస్ జగన్‌పై రాయి దాడి కేసులో.. సతీష్‌ను మరో కోడికత్తి శ్రీనుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని సీఈవోకు వివరించామని వర్ల రామయ్య తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం...
Updated Date - Apr 19 , 2024 | 07:41 PM