TDP MLA: ‘చెవిరెడ్డి’ చేసింది తప్పుకాదా.. ప్రతిఒక్కరూ ఆలోచించండి
ABN, Publish Date - Dec 03 , 2024 | 02:01 PM
‘చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నమ్మి వైసీపీ నేతలు పదేపదే మోసపోతుంటారు. ఎర్రావారిపాలేనికి చెందిన బాలిక తండ్రిని నేనెప్పుడూ విమర్శించను. గతంలో ఆయన ఏమి మాట్లాడారో, ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాడో ప్రజలందరికీ తెలుసు. చెవిరెడ్డి చేసింది తప్పు కాదా? అని మాత్రమే ఆలోచించండి. మనకి కూడా ఆడబిడ్డలు ఉన్నారు. మీవిజ్ఞతకే వదిలేస్తున్నా’ అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని(Chandragiri MLA Pulivarthi Nani) వ్యాఖ్యానించారు.
- బాలిక తండ్రి గొంతు నొక్కేసినా సాక్ష్యాలు ఉన్నాయన్న ఎమ్మెల్యే నాని
తిరుపతి: ‘చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నమ్మి వైసీపీ నేతలు పదేపదే మోసపోతుంటారు. ఎర్రావారిపాలేనికి చెందిన బాలిక తండ్రిని నేనెప్పుడూ విమర్శించను. గతంలో ఆయన ఏమి మాట్లాడారో, ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాడో ప్రజలందరికీ తెలుసు. చెవిరెడ్డి చేసింది తప్పు కాదా? అని మాత్రమే ఆలోచించండి. మనకి కూడా ఆడబిడ్డలు ఉన్నారు. మీవిజ్ఞతకే వదిలేస్తున్నా’ అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని(Chandragiri MLA Pulivarthi Nani) వ్యాఖ్యానించారు. ఎర్రావారిపాళెం మండలం యల్లమంద ఘటనపై బాలిక తండ్రితో కలిసి వైసీపీ నేతలు భూమన కరుణాకరరెడ్డి, నారాయణస్వామి ఆదివారం మీడియాతో మాట్లాడిన వ్యవహారంపై సోమవారం నాని స్పందించారు.
ఈ వార్తను కూడా చదవండి: ప్రేమ వ్యవహారంలో.. యువకుడిని చంపేశారు...
యల్లమంద ఘటన సమయంలో రమణతో కలసి ఆయన కోడలు మాట్లాడిన వీడియోలను మీడియాకు చూపించారు. ఫిర్యాదుదారుల గొంతు నొక్కేస్తే సుమోటాగా కూడా తీసుకునే అవకాశం పోక్సో కేసులకు ఉందన్న విషయం వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. గత ఐదేళ్లుగా చెవిరెడ్డిపై పోరాటం చేస్తున్నానని, భూమనకు శిష్యుడునని చెప్పుకునే చెవిరెడ్డి ఆయన పట్ల ఎలా నడుచుకుంటున్నారో కూడా అందరికీ తెలుసన్నారు. పోలీసులు కక్షసాధింపుగా కేసులు పెడుతున్నారని చెప్పడం సరికాదన్నారు.
ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో అనవసరంగా 37 మంది టీడీపీ నాయకులపై చెవిరెడ్డి కేసులు పెట్టించారని గుర్తుచేశారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగిందా? లేదా? అని మాత్రమే ఆలోచించాలన్నారు. సాక్ష్యాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయని, న్యాయవ్యవస్థ ఎవరికి అన్యాయం జరిగిందో వారిని కాపాడితీరుతుందన్నారు. గత ఐదేళ్లులో తిరుపతి రూరల్లో అభివృద్ధి ఆగిపోయిందని, ఇప్పుడు వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నారన్నారు.
వార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 03 , 2024 | 02:01 PM