పది విజయానికి ప్రణాళిక
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:40 AM
మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు పాఠశాల విద్యాశాఖ ఎస్‌ఈఆర్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.
విద్యాశాఖ ఎస్‌ఈఆర్టీ ఆధ్వర్యంలో సిద్ధం
చాగలమర్రి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు పాఠశాల విద్యాశాఖ ఎస్‌ఈఆర్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్వహణతో పాటు మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆదివారం కూడా అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 28,294 మంది ఉన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో 16, ఏపీఎంఎస్ 20, బీసీ 6, ప్రభుత్వ పాఠశాలు 12, కేజీబీవీ 26, ఎంపీఎల్ 4, పీవీటీ 172, ఎస్‌డబ్ల్యూ 5,
టీడబ్ల్యూ 12 జెడ్పీ పాఠశాలలు 182 ఉన్నాయి. ఇందులో బాలికలు 12,085, బాలురు 13,209 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ విద్యార్థులు ఈ ఏడాది పది పబ్లిక్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.
ఫ ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు మధ్యాహ్నం 2.40 గంటల నుంచి 4 గంటల వరకు
ఫ ఆదివారాల్లో ఉదయం 8.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.
ఫ ఇవి మార్గదర్శకాలు
ఫ విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధతో వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, అదనపు తరగతుల నిర్వహణ, నిత్యం చిన్న చిన్న పరీక్షలు పెట్టడం, అవసరమైన పాఠాల పునశ్ఛరణ, పబ్లిక్ పరీక్షల బ్లూప్రింట్ నమూనాలో ప్రీ ఫైనల్ నిర్వహించి భయం పోగొడతారు.
ఫ ఉన్నతాకారుల పర్యవేక్షణకు వీలుగా ప్రతి విద్యార్థి జవాబు పత్రాలు, మార్కుల పత్రాలను భద్రపరచడం, రానున్న రోజుల్లో ఎఫ్‌ఏ-2, ఎఫ్‌ఏ-1 గ్రాంట్ టేస్టు, ప్రి ఫైనల్ పరీక్షల సన్నద్ధత దీనిలో భాగమేనని, ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఫ అదే సమయంలో మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తేదీలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఫ విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహించి, వారికి పరీక్షలు పెట్టి వచ్చిన మార్కుల ఆధారంగా వారిని గ్రేడ్‌లుగా విభజిస్తారు. తదనుగుణంగా వారికి బోధించి మంచి ఫలితాలు సాధించే దిశగా చర్యలు చేపడుతున్నారు.
ఫ పాఠశాల వారీగా ప్రభుత్వం హోలిస్టిక్ కార్డులు ఇటీవల పంపిణీ చేసింది. వీటిపై ఇప్పటి వరకు అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను ముద్రించి తల్లిదండ్రులకు అందజేయనున్నారు. వందరోజుల దీక్షలో ఎంఈవోలు పర్యవేక్షణ చేసి హెచఎంలు, ఉపాధ్యాయులకు ప్రోత్సహిస్తూ పర్యవేక్షణ చేస్తారు.
జిల్లాలో మంచి ఫలితాలు సాధిస్తాం: జనార్దనరెడ్డి, డీఈవో, నంద్యాల జిల్లా
జిల్లాలో మంచి ఫలితాలు సాధించే దిశగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలవుతుంది. విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించి వారి మదింపు అంచనా వేసి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటాం. పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
Updated Date - Dec 26 , 2024 | 12:40 AM