ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ 45 టీఎంసీలు ఏపీకే ఇవ్వాలి

ABN, Publish Date - Nov 07 , 2024 | 05:22 AM

పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే.. నాగార్జునసాగర్‌కు ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునేలా గతంలో ఒప్పందం జరిగిందని ఏపీ తరఫు సాక్షి అనిల్‌కుమార్‌ గోయల్‌ తెలిపారు.

కృష్ణా డెల్టాకు మేం వాడుకోవాలి

48 ఏళ్లుగా ప్రాజెక్టుల ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి నీటి కేటాయింపులు

విభజన తర్వాత కూడా వాటికి తెలంగాణ అంగీకరించింది

కృష్ణా ట్రైబ్యునల్‌లో ఏపీ తరఫు సాక్షి గోయల్‌ వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే.. నాగార్జునసాగర్‌కు ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునేలా గతంలో ఒప్పందం జరిగిందని ఏపీ తరఫు సాక్షి అనిల్‌కుమార్‌ గోయల్‌ తెలిపారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర 35 టీఎంసీలు వాడుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయని, మిగిలిన 45 టీఎంసీలు తెలంగాణకు రావని.. ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ఆ 45 టీఎంసీలు తనకే చెందుతాయని వాదిస్తోందని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిందని.. కానీ ఆంధ్ర ఆ నీటిని కృష్ణా డెల్టాకు వాడుకోవలసి ఉంటుందని వెల్లడించారు. సాగర్‌కు దిగువన వాడినా ఎగువ ప్రాంతంలోనే వాడినట్లుగా పరిగణనలోకి తీసుకోవాలని తేల్చిచెప్పారు. బుధవారం జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్‌-2 ముందు తెలంగాణ తరపు న్యాయవాదులు అడిగిన పలు ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం తరఫున గోయల్‌ సమాధానాలిచ్చారు. రక్షిత ప్రాజెక్టులు, అదనపు ప్రాజెక్టుల ఆధారంగా ఉమ్మడి ఏపీకి కేటాయింపులు జరిగాయని, ఈ ప్రాజెక్టులకు కేటాయింపులు/వినియోగం గత 48 ఏళ్లుగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ కేటాయింపులకు పలు అంతర్రాష్ట్ర సమావేశాల్లో తెలంగాణ సమ్మతి తెలిపిందని గుర్తు చేశారు. 2015 జూన్‌లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందమే దీనికి ఆధారమని తెలిపారు. జూరాల నుంచి 37.84 టీఎంసీలనే వాడుకునేలా తెలంగాణను నియంత్రించాలని ఆపరేషన్‌ ప్రొటోకాల్స్‌లో ప్రతిపాదించడాన్ని గోయల్‌ సమర్థించుకున్నారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్‌-11లో పేర్కొని, రక్షణ కల్పించిన ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాలు కాకుండా మిగులు జలాలనే సరఫరా చేయాల్సి ఉంటుందని, అందుకే నెట్టెంపాడు ప్రాజెక్టును సైతం పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 05:22 AM