ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: నేడు, రేపు ఏపీలో వరద ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం

ABN, Publish Date - Sep 11 , 2024 | 09:03 AM

నేడు, రేపు ఏపీలో వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నష్టం అంచనా వేస్తున్నారు. రెండు బృందాలుగా జిల్లాలకు.. దీంతో ఈ రోజుకు గృహ నష్టం అంచనా పూర్తి కావాలనీ కలెక్టర్లకు ఆర్‌పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి: నేడు, రేపు ఏపీలో వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నష్టం అంచనా వేస్తున్నారు. రెండు బృందాలుగా జిల్లాలకు.. దీంతో ఈ రోజుకు గృహ నష్టం అంచనా పూర్తి కావాలనీ కలెక్టర్లకు ఆర్‌పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్‌ జిల్లాల పరిధిలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఏపీలో పర్యటించనుంది. రెండు టీమ్‌లుగా విడిపోయి కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.


రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా నేతృత్వంలో కేంద్ర బృందంతో భేటీ కానుంది. భేటీలో ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరద నష్ట తీవ్రతను కేంద్ర బృందానికి సిసోడియా వివరించనున్నారు. కేంద్రం నుంచి వచ్చే అధికారుల్లో ఒక టీమ్‌ బుధవారం మధ్యాహ్నం 12.30 నుంచి 5.30 వరకు కృష్ణా జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. రెండో బృందం బాపట్ల జిల్లాలోని కొల్లూరు, వేమూరు, రేపల్లె, చెరుకుపల్లి మండలాల పరిధిలో పర్యటించనుంది. మధ్యాహ్నం యనమలకుదురులో గ్రామీణ నీటి సరఫరా స్కీమును బృందం పరిశీలించనుంది. అనంతరం అక్కడి నుంచి పెద్దపులిపాకలోని దెబ్బతిన్న ఇల్లు, ఉద్యానవనం పంటలు, చోడవరంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనుంది. అనంతరం దెబ్బతిన్న రొయ్యూరు కంకిపాడు రోడ్డును అధికారులు పరిశీలించనున్నారు.


నందివాడ మండలంలో నీటిలో మునిగి ఉన్న ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించనుంది. బాపట్ల జిల్లాలో నేడు రెండవ బృందం పర్యటించింది. వేమూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పంట నష్టంపై ఏర్పాటుచేసిన ప్రజెంటేషన్‌ను బృందం తిలకించనుంది. అనంతరం ఈపూరు లంకలోని దెబ్బతిన్న ఉద్యానవన పంటలను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి అరవింద వారధి వద్ద గండి పడిన ప్రదేశాన్ని కేంద్ర బృందం పరిశీలించనుంది. అక్కడి నుంచి పెసర్లంకలోని దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి వరద బాధితులతో కేంద్ర బృందం మాట్లాడనుంది. అక్కడి నుంచి నక్క పాయకు చేరుకుని కేంద్ర బృందం పరిశీలించనుంది. పల్లెపాలెం వద్ద వోలేరు గండిని పరిశీలించనుంది. అక్కడి నుంచి రావి అనంతవరం వద్ద గండి పడిన ప్రదేశానికి కేంద్ర బృందం చేరుకోనుంది. అనంతరం కంగాల గ్రామంలోని వ్యవసాయ భూములను పరిశీలించనుంది. దీంతో కేంద్ర బృందాల తొలిరోజు పర్యటన పూర్తి అవుతుంది.

Updated Date - Sep 11 , 2024 | 09:03 AM

Advertising
Advertising