‘సత్యసాయి’ వైద్యసేవలు అమోఘం
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:49 PM
సత్యసాయి సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రి పేదలకు అందిస్తున్న ఆధునాతన వైద్యసేవలు అమోఘమని రిలయన్స ఇండసీ్ట్రస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పీఎంఎస్ ప్రసాద్ కొనియాడారు.
పుట్టపర్తిరూరల్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): సత్యసాయి సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రి పేదలకు అందిస్తున్న ఆధునాతన వైద్యసేవలు అమోఘమని రిలయన్స ఇండసీ్ట్రస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పీఎంఎస్ ప్రసాద్ కొనియాడారు. శుక్రవారం బొంబాయి నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి శ్రీసత్యసాయి ఎయిర్ పోర్టుకు ఆయన చేరుకున్నారు. ఆయన మొదట ప్రశాంతి నిలయంలో శ్రీసత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పరిశీలించారు. శ్రీసత్యసాయి సెంట్రల్‌ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ హాస్పిటల్‌లో పేదలకు అందిస్తున్న వైద్య సేవలను ఆయనకు వివరించారు. అత్యాధునిక వైద్య పరికరాలను చూపించారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ.. సత్యసాయి శివైక్యం తర్వాత బాబావారి అడుగుజాడల్లో సత్యసాయిసెంట్రల్ ట్రస్టు నడస్తూ.. పేదలకు అత్యంత ఖరీదైన వైద్యసేవలను పూర్తీ ఉచితంగా అందించడం ఆమోఘమని కొనియాడారు. ఆయన వెంట పలువురు రిలయన్స ప్రతినిధులు, హాస్పిటల్ జాయింట్ డైరక్టర్ అనిల్‌కుమార్ మెక్‌పూర్, సత్యసాయిసేవాసంస్థల కో-ఆర్డినేటర్ కోటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ హరనాథ్ ఉన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 11:49 PM