Lanka Dinakar: తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు కలిసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాయి
ABN, Publish Date - Jul 31 , 2024 | 01:05 PM
తల్లి - పిల్ల కాంగ్రెస్ పేరిట ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ సర్వనాశనం చేసిందంటూ దుమ్మెత్తి పోశారు.
విజయవాడ: తల్లి - పిల్ల కాంగ్రెస్ పేరిట ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ సర్వనాశనం చేసిందంటూ దుమ్మెత్తి పోశారు. బీజేపీ ప్రస్తుతం ఏపీని ఆదుకుంటోందని.. అమరావతితో పాటు రైల్వే లైన్ కోసం నిధులు కేటాయించిందని ప్రశంసలు కురిపించారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు కలిసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని లంకా దినకర్ అన్నారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగిందని పేర్కొన్నారు. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేయుటమే కాకుండా, ఏపీ పునర్విభజన చట్టాన్ని అస్తవ్యస్తంగా తయారు చేయడం వెనుక జై రామ్ రమేష్, చిదంబరం ఉన్నారని లంకా దినకర్ అన్నారు. పోలవరం చెల్లని చెక్కు చేద్దామని కాంగ్రెస్ భావించింది. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు కలిసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాయన్నారు. ఏడు మండలాలు ఏపీలో కలిపి ఇప్పటి వరకు 15 వేల కోట్ల రూపాయల నిధులు మోదీ సర్కార్ ఇచ్చిందని లంకా దినకర్ పేర్కొన్నారు. పోలవరం పూర్తి చేసే భాద్యత కేంద్రానిదని బడ్జెట్ 2024 - 25 లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారని లంకా దినకర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు నిధులతోపాటు, మౌలిక సదుపాయాలు, ఔటర్ రింగ్ రోడ్డు, స్మార్ట్ సిటీ కోసం 3000 కోట్లు నిధులు, భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు విలువ 25 వేల కోట్లు పైమాటేనని లంకా దినకర్ పేర్కొన్నారు. అమరావతి రైల్ లైన్ కోసం 2,500 కోట్లు, దాదాపు 50 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించడానికి అడుగులు వేసిందన్నారు. రాజధాని నిర్మాణం చెల్లని చెక్కు చెయ్యాలని తల్లి కాంగ్రెస్ చూస్తే, జరిగే పురోగతిని పిల్ల కాంగ్రెస్ అధోగతి పట్టించిందని లంకా దినకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నామినేటెడ్ పోస్టులు వారికే: సీఎం చంద్రబాబు
గవర్నర్‌గా నేడు జిష్ణు దేవ్ వర్మ ప్రమాణస్వీకారం
బినామీ పేర్లతో పెద్దిరెడ్డి భూముల రిజిస్ట్రేషన్..
మద్యం బాటిళ్లకు నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లు..
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 31 , 2024 | 01:05 PM