ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: వైసీపీ నేత ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీలపై బిగుస్తున్న ఉచ్చు..

ABN, Publish Date - Jul 19 , 2024 | 08:49 AM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రొయ్యల ఫ్యాక్టరీలపై రోజురోజుకూ ఉచ్చు బిగుస్తోంది. దీని నుంచి భారీగా విష వ్యర్థ జలాల కాలుష్యాలు వెదజల్లుతోంది.

కాకినాడ: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రొయ్యల ఫ్యాక్టరీలపై రోజురోజుకూ ఉచ్చు బిగుస్తోంది. దీని నుంచి భారీగా విష వ్యర్థ జలాల కాలుష్యాలు వెదజల్లుతోంది. ఈ కాలుష్యంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (PCB) సీరియస్ అయ్యింది. గురజనాపల్లి, లంపకలోవ ఫ్యాక్టరీలను రెండు మూడు రోజుల్లో సీజ్ చేసే అవకాశం ఉంది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో రొయ్యల ఫ్యాక్టరీల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. లంపకలోవ ఫ్యాక్టరీ నుంచి భారీగా కాలుష్య వ్యర్థ జలాలు వెదజల్లుతున్నట్లు గుర్తించారు. శుద్ధి చేయకుండానే నేరుగా పంట పొలాల్లోకి రెట్టింపు సామర్థ్యంతో గుర జనాపల్లి ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు.


కాకినాడ జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాల కాలుష్యంపై పీసీబీ చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలపై పీసీబీ షో కాజ్ నోటీస్ జారీ చేసింది. ఆ నోటీసులకు తాజాగా కంపెనీ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. తమ వద్ద అసలు కాలుష్యమే లేదంటూ బుకాయించింది. దీంతో చర్యలకు పీసీబీ సిద్ధమవుతోంది. కళ్ల ముందే కాలుష్యం కనిపిస్తున్నా.. ఆయా ఫ్యాక్టరీలు అదేమీ లేదని బుకాయించాయి. దీంతో నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్న ఫ్యాక్టరీలను సీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.


వాస్తవానికి ఈ రొయ్యల ఫ్యాక్టరీల అరాచకాలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నెల 2న కాకినాడ కలెక్టరేట్‌లో ఆయన జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. ఆ ఫ్యాక్టరీల్లో కాలుష్యం భారీగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వారిపై మండిపడ్డారు. ద్వారంపూడికి చెందిన వీరభద్రా ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ కంపెనీపై తనకు ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని, కంపెనీ ఆక్వా వ్యర్థ జలాలను పక్కనే పంట డ్రెయిన్లలో కలిపేస్తున్నా ఎందుకు తనిఖీలు చేయలేదని నిలదీశారు. 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని పీసీబీ ఈఈ సందీప్‌రెడ్డిని ఆదేశించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ కవ్వింపులకు రెచ్చిపోవద్దు

విజయసాయిరెడ్డికి పిచ్చి పట్టింది

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 19 , 2024 | 08:49 AM

Advertising
Advertising
<