ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Somu Veerraju: కాకినాడ పోర్ట్ లో రేషన్ దందా చాలా జరిగింది

ABN, Publish Date - Jul 05 , 2024 | 01:26 PM

ఈనెల 8 వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాజమండ్రిలో ఏర్పాటు చేసినట్టు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ ముఖ్య అతిథిగా, రాజ్యసభ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారన్నారు.

రాజమండ్రి: ఈనెల 8 వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాజమండ్రిలో ఏర్పాటు చేసినట్టు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు (Somu Veerraju) తెలిపారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ ముఖ్య అతిథిగా, రాజ్యసభ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారన్నారు. ఏపీ అభివృద్ధే ప్రధాన అజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తానని తెలిపారు. ప్రజల అభీష్టం మేరకే బీజేపీ వైఖరి ఉంటుందన్నారు. విడిపోయిన రాష్ట్రానికి అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. జగన్ వేసిన అవినీతి బీజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని సోము వీర్రాజు వెల్లడించారు.


కాకినాడ పోర్ట్‌లో రేషన్ దందా చాలా జరిగిందని సోము వీర్రాజు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అవినీతిని బయటపెట్టారన్నారు. జగన్ ప్రతిపక్షంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని.. అప్పుడు దాన్ని తాను ఖండించానన్నారు. పోలవరం ప్రజల వరం, బీజేపీ నిర్మించడానికి సిద్ధంగా ఉందన్నారు. గతంలో 15 వేల కోట్ల రూపాయిలు పోలవరం నిర్మాణానికి కేంద్రం ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు తేవడంలో బీజేపీ సమర్ధ పాత్ర వహిస్తుందని సోము వీర్రాజు తెలిపారు.

ఇవి కూడా చదవండి...

Hyderabad: బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్.. కారణమిదేనట..!

Harish Rao: ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు.. అప్రజాస్వామ్యపాలన

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 05 , 2024 | 01:26 PM

Advertising
Advertising