ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోల్‌మోడల్‌లా తిరుమల

ABN, Publish Date - Dec 20 , 2024 | 05:31 AM

తిరుమలలో పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు టీటీడీ దూరదృష్టితో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రపంచానికి ఆధ్యాత్మికపరంగా రోల్‌మోడల్‌లా తిరుమలను అభివృద్ధి చేసేందుకు నడుంకట్టింది.

అభివృద్ధికి టీటీడీ ప్రణాళిక

తిరుమల విజన్‌-2047 ప్రారంభం

ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే ఏజెన్సీలకు ఆహ్వానం

తిరుమల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు టీటీడీ దూరదృష్టితో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రపంచానికి ఆధ్యాత్మికపరంగా రోల్‌మోడల్‌లా తిరుమలను అభివృద్ధి చేసేందుకు నడుంకట్టింది. ‘స్వర్ణాంధ్ర విజన్‌-2047’ స్ఫూర్తితో ‘తిరుమల విజన్‌-2047’ను ప్రారంభించింది. తిరుమలలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టిసారించేలా వ్యూహాత్మక ప్రణాళికను రూపొందిస్తోంది. ఆ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రముఖ ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం ఆర్‌ఎ్‌ఫపీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌)ను విడుదల చేసింది. తిరుమల అభివృద్ధిలో సంప్రదాయాన్ని, ఆధునికతను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు టీటీడీ ఉన్నతాధికారులకు సూచించారు. ఆధ్యాత్మిక పవిత్రత, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి ముందుచూపుతో భక్తులకు సౌకర్యాలు, వసతిని మెరుగుపరచాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించాలని ఇటీవల జరిగిన సమావేశంలో టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.

కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం

తిరుమల విజన్‌-2047 లక్ష్యాలను చేరుకునేందుకు, పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చర్‌, ఇంజనీరింగ్‌, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలను టీటీడీ గురువారం ఆహ్వానించింది. ఇప్పటికే తిరుమల పట్టణ అభివృద్ధిపై ప్రణాళికను సిద్ధం చేసిన టీటీడీ, మూడు వారాల్లోగా ఆసక్తి కలిగిన, ముందస్తు అనుభవం ఉన్న ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది.

విజన్‌-2047 లక్ష్యాలు

ఆధునిక పట్టణ ప్రణాళిక నిబంధనలను అనుసరిస్తూ తిరుమల పవిత్రతను పెంపొందించేందుకు శాశ్వత వ్యూహాలను అమలుచేయడం.

వారసత్వ పరిరక్షణ, పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వడం.

ప్రపంచంలో తిరుమలను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించడం.

అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయడం.

ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జోన్‌ల అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయడం.

తిరుమలలో పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడానికి భవిష్య వ్యూహాలను రూపొందించడం.

ప్రాముఖ్యత కలిగిన మౌలిక సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం.

Updated Date - Dec 20 , 2024 | 05:31 AM