Tirumala Laddu: ఆ వ్యక్తి వల్లే ఈ దుర్మార్గం జరిగింది
ABN, Publish Date - Sep 23 , 2024 | 03:53 PM
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నూనెలు వాడారంటూ నివేదికలు సైతం స్పష్టం చేసిన నేపథ్యంలో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓ.వి. రమణ సోమవారం తిరుపతిలో స్పందించారు. నెయ్యిలో జరిగిన దుర్మార్గం మళ్లీ జరగ కూడదంటే పాలకమండలి సభ్యుల నియామకం నుంచి పర్చేజ్ కమిటీ వరకు ప్రతి అంశంలోనూ ప్రక్షాళన అవసరమని ఆయన స్పష్టం చేశారు.
తిరుపతి, సెప్టెంబర్ 23: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నూనెలు వాడారంటూ నివేదికలు సైతం స్పష్టం చేసిన నేపథ్యంలో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓ.వి. రమణ సోమవారం తిరుపతిలో స్పందించారు. నెయ్యిలో జరిగిన దుర్మార్గం మళ్లీ జరగ కూడదంటే పాలకమండలి సభ్యుల నియామకం నుంచి పర్చేజ్ కమిటీ వరకు ప్రతి అంశంలోనూ ప్రక్షాళన అవసరమని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Kim Jong Un: కిమ్ మరోసారి క్రూర నిర్ణయం.. ఇద్దరు మహిళలకు ఉరి.. పలువురికి జీవిత ఖైదు
Also Read: Narendra Modi: యూఎస్‌లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు
సీఎం జగన్ ... 25 మంది సభ్యులకు పెంచారు
1963లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలిలో 11 మంది సభ్యులున్నారన్నారు. 1979 నాటికి పాలక మండలి సభ్యుల సంఖ్య 13కి చేరిందని చెప్పారు. ఇక 2004 నాటికి ఆ సంఖ్య కాస్తా 15 అయిందన్నారు. కానీ 2019లో ఆ సంఖ్యను 25కు పెంచారని ఈ సందర్బంగా ఒ.వి.రమణ గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్ అఫిషియో సభ్యుల నియామకం సైతం జరుగుతోందన్నారు. ఇటువంటి నియామకాలు తగవని కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగాఆయన సూచించారు.
Also Read: Jammu And Kashmir: నేటితో ముగియనున్న రెండవ దశ ఎన్నికల ప్రచారం
ఆ వ్యక్తి వల్లే ఈ దుర్మార్గం..
లోకల్ అడ్వైజరీ సభ్యుడుగా ఉన్న వ్యక్తికి ఓటింగ్ హక్కు ఉండదన్నారు. కానీ అలాంటి వ్యక్తిని పర్చేజ్ కమిటీ సభ్యుడిగా నియమించారని ఆయన వివరించారు. ఆ వ్యక్తి వల్లే ఈ దుర్మార్గం జరిగిందని ఓ.వీ.రమణ కుండ బద్దలు కొట్టారు.
Also Read: Viral News: తనను కిడ్నాప్ చేసిన వారికి శిక్ష పడేలా చేసిన యువకుడు.. అదీ 17 ఏళ్ల తర్వాత.. ఎలాగంటే..?
రక్తం కక్కుకుని చస్తారు
తుడా ఛైర్మన్‌ను టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండకూడదన్నారు. ఎందుకంటే.. తుడా పదవి సెక్యూలర్ పోస్టు అని స్పష్టం చేశారు. ఇక టీటీడీ బోర్డులో హిందువు మాత్రమే ఉండాలని స్పష్టం చేసినప్పుడు తుడా ఛైర్మన్‌గా రేపు అన్య మతస్తులను నియమిస్తే పరిస్థితి ఏమిటని ఆయన ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని చాటమని చెపితే... శ్రీవారికి పోటీగా తిరుమలలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించారన్నారు. వారు చెబుతున్నట్లు ఇలాంటి వారు తప్పకుండా రక్తం కక్కుకుని చస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం
ఇష్టానుసారం టెండర్లు మారుస్తున్నారు..
తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి ఆగమోక్తమైన దిట్టం ఉంటుంది. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం పేరుతో దిట్టాన్ని ఇష్టానుసారం మార్చేశారని విమర్శించారు. టెండర్ కండిషన్లను సైతం రివర్స్ టెండరింగ్ పేరుతో ఇష్టానుసారంగా మార్చేశారని ఆరోపించారు. తాము ఎవరికి టెండర్ ఇవ్వాలనుకుంటున్నారో వారికి తగ్గట్టు టెండర్ కండిషన్లు మార్చుకున్నారన్నారు.
Also Read: Hyderabad: పలు ప్రాంతాల్లో నేడు మంచి నీటి సరఫరా బంద్
ఇది చాలు గోలుమాలు జరిగిందని చెప్పడానికి...
టెండర్ కండిషన్లు మార్చటం వల్లే ఈ దుర్మార్గాలు జరిగాయన్నారు. అయితే 18 ట్యాంకర్లు రిటర్న్ చేశామని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారన్నారు. మరి అన్ని ట్యాంకులు రిటర్న్ చేశాక.. మళ్లీ వారి వద్దే నెయ్యి ఎందుకు కొనుగోలు చేశారంటూ సందేహం వ్యక్తం చేశారు. ఇది చాలు గోల్‌మాల్ జరిగిందనడానికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఒవి రమణ పేర్కొన్నారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 23 , 2024 | 03:53 PM