AP News: సత్తెనపల్లిలో కత్తులతో ఇద్దరు యువకులు వీరంగం
ABN, Publish Date - Sep 12 , 2024 | 08:18 AM
కత్తులతో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. సత్తెనపల్లిలోని వడ్డవల్లి ఏరియాలో కత్తులతో యువకులు హల్చల్ చేశారు. ముగ్గురిపై యువకులు కత్తులతో దాడి చేశారు.
పల్నాడు: కత్తులతో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. సత్తెనపల్లిలోని వడ్డవల్లి ఏరియాలో కత్తులతో యువకులు హల్చల్ చేశారు. ముగ్గురిపై యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో వెంకటేష్, పవన్ అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు.
దాడి చేసిన యువకుల ఇళ్లపై బాధితుల బందువులు దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే.. పోలీసులు - బాధిత బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. యువకుల ఇళ్లు - పోలీసు జీపులపై సైతం భాదితుల బంధువులు రాళ్లు రువ్వారు. పోలీసులు అడ్డుకున్నా కూడా బాధితుల బందువులు ఆగలేదు. ఈశ్వర్ సాయి సినిమా హాల్ దగ్గర రోడ్‌పై బైకును బాధితుల బంధువులు తగులబెట్టారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో పికెట్ ఏర్పాటు చేశారు.
Updated Date - Sep 12 , 2024 | 08:18 AM