ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్టీసీ బస్సులో ఉరితిరుపతిలో గుర్తు తెలియని యువకుడి అఘాయిత్యం

ABN, Publish Date - Nov 25 , 2024 | 03:58 AM

ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని యువకుడు ఆదివారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి తెల్లవారుజామున పల్లె వెలుగు బస్సు బయలుదేరింది.

రేణిగుంట, నవంబరు 24(ఆంధ్రజ్యో తి): ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని యువకుడు ఆదివారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి తెల్లవారుజామున పల్లె వెలుగు బస్సు బయలుదేరింది. ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామం వద్ద ఒక యువకుడు బస్సు ఎక్కి తిరుపతికి టికెట్టు తీసుకున్నాడు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులే ఉన్నారు. ఈ యువకుడు బస్సు వెనుక భాగంలో కూర్చున్నాడు. తర్వాత తన జాగర్‌ ప్యాంటు లేస్‌ను బస్సు పైకప్పునకు ఉన్న ఇనుప రాడ్డుకు కట్టి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేణిగుంట మండలం గుత్తివారిపల్లి వద్ద ఒక ప్రయాణికుడు బస్సు దిగే సమయంలో దీనిని గుర్తించి కండక్టరు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే బస్సు ఆపి పరిశీలించి పోలీసులకు, ఆర్టీసీ డిపో అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కకడికి చేరుకుని మృతదేహాన్ని తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. మృతుడి ఫొటోలను అన్ని జిల్లాల పోలీసు స్టేషన్లకు పంపించి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Updated Date - Nov 25 , 2024 | 03:58 AM