ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేంద్ర మంత్రి అమిత షా వెంటనే క్షమాపణ చెప్పాలి

ABN, Publish Date - Dec 20 , 2024 | 11:34 PM

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత షా వెంటనే క్షమాపణలు చెప్పాలని పీలేరులోని పలు ప్రజాసంఘాల నేతలు డిమాం డ్‌ చేశారు.

కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పీలేరు, డిసెంబరు 20(ఆంరఽధ జ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత షా వెంటనే క్షమాపణలు చెప్పాలని పీలేరులోని పలు ప్రజాసంఘాల నేతలు డిమాం డ్‌ చేశారు. అమిత షా వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం వారు స్థానిక అంబే డ్కర్‌ కూడలిలో కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయ నను అవమానించిన అమిత షా కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. కార్యక్ర మంలో డీవీఎంసీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, వివిధ సంఘాల నాయకులు ధరణీకుమార్‌, జెట్టి మల్లిఖార్జున, దుబ్బా శ్రీకాంత, రాజేశ్వరి, బుక్కే హరినాయక్‌, బద్దె భానుప్రకాశ, ముల్లంగి కృష్ణయ్య, ఆనంద్‌, బాలగం గాధర్‌, రవిచంద్ర, రెడ్డయ్య, సురేంద్ర, గురునాథ, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర హోంమంత్రిని వెంటనే సస్పెండ్‌ చేయాలి

మదనపల్లె అర్బన, డిసెంబరు 20(ఆంద్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత షాను వెంటనే సప్ఫెండ్‌ చేయాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో బీఎస్పీ జెండాలతో ఆ పార్టీ నాయకులు కేంద్రమంత్రి అమితసాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ రోజు దేశంలో బడుగుబలహీన వర్గాలు హక్కులు సాధించుకొంటున్నారంటే అది డాక్టర్‌ అంబేడ్కర్‌ భారత రాజ్యాంగంలో పొందుపర్చడమే అన్నారు. కేంద్ర మంత్రి వెంటనే దేశ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమణ, బాలాజీ, శ్రీనాథ్‌, గంగాధర్‌, శివ, సంధ్య, అనిల్‌, మహేష్‌, రెడ్డెప్ప, వేంపల్లె శివ, నల్లప్ప, పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 11:34 PM