Pemmasani Chandrasekhar : కేంద్ర సాయం అందేలా కృషి
ABN, Publish Date - Sep 06 , 2024 | 05:08 AM
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందించేందుకు కృషి చేస్తానని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. వ
బాబు రెప్ప వేయకుండా పనిచేస్తున్నారు: పెమ్మసాని
తెనాలి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందించేందుకు కృషి చేస్తానని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. వరదల నష్ట తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కృష్ణా నది వరదల కారణంగా గుంటూరు జిల్లాలో పంటలు నష్టపోయిన కొల్లిపర మండలంలోని లంక గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించారు.
‘‘విపత్తును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సఫలీకృతమైంది. సంబంధిత కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి, ప్రధానంగా రైతులకు అవసరమైన సాయం ఏ మేర ఉందనేది వివరిస్తా. పంట నష్టంతో పాటు విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించేందుకు కేంద్ర సాయాన్ని కోరుతా’ అని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా డ్యామ్‌లు, బ్యారేజీలను పట్టించుకున్న దిక్కేలేదని, వీటిపై శ్రద్ధ చూపి ఉంటే కచ్చితంగా ఇంత విపత్తు ఉండేది కాదని పెమ్మసాని విమర్శించారు. గత పాలకులు చేసిన పాపాన్ని రైతులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం భరించాల్సి వస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటిపై రెప్ప వేయకుండా సహాయ చర్యలపై దృష్టి పెట్టారన్నారు. రికార్డు సమయంలో ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితిని తీసుకురాగలిగారన్నారు.
Updated Date - Sep 06 , 2024 | 05:08 AM