10 గిగావాట్ల పవర్!
ABN, Publish Date - Oct 25 , 2024 | 04:03 AM
రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు వేదాంత గ్రూప్ కంపెనీ సెరెంటికా గ్లోబల్ ముందుకొచ్చింది.
ఏపీలో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు పెడతాం
మంత్రి లోకేశ్‌కు ‘సెరెంటికా’ ప్రతినిధుల ప్రతిపాదన
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు వేదాంత గ్రూప్ కంపెనీ సెరెంటికా గ్లోబల్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌శాఖ మంత్రి లోకేశ్‌కు ప్రతిపాదన చేశారు. గురువారం ముంబైలోని ఆ సంస్థ కార్యాలయంలో మంత్రి లోకేశ్ వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. తమ సంస్థ ఏపీలో 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు లోకేశ్‌కు వివరించారు. 2030 నాటికి రాష్ట్రంలో 72 గిగావాట్ల పునరుద్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్య సాధనలో సెరెంటికా భాగస్వామి అవుతుందని మంత్రి వెల్లడించారు.
Updated Date - Oct 25 , 2024 | 04:03 AM