Snakes: పల్లె వాసులను కలవరపెడుతున్న విష సర్పాలు
ABN, Publish Date - Nov 06 , 2024 | 05:37 PM
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విష సర్పాలు పల్లె వాసులను కలవరపెడుతున్నాయి. ఈ విష సర్పాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో విష సర్పాలు పల్లె వాసులను కలవరపెడుతున్నాయి. ఈ మధ్యన కురిసిన భారీ వర్షాలకు, రోడ్ల నిర్మాణానికి వాడే ఎర్ర కంకర తరలించే క్వారీ లారీల ద్వారా ఇవి జనావాసాలకి వస్తున్నాయని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ తెలిపారు. అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలో ఒక ఇంట్లో నిన్న రాత్రి గోధుమ త్రాచు చొరబడింది.
జాగ్రత్తగా ఉండాలి..
ఈ రోజు మధ్యాహ్నం వంట చేస్తుండగా వంటింట్లో సింకు వెనుక అలికిడి కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు పాము ఉందని గుర్తించారు. వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ అనే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. అతడు ఘటన స్థలంకు వచ్చి ఆ నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. పామును చూసిన స్థానిక ప్రజలు భయందోళన చెందారు. ఇటువంటి విష సర్పాలు తరచుగా ఇళ్లల్లోకి చొరుబడుతున్నాయని, ప్రతిరోజు ఎక్కడో చోట వీటిని పట్టుకొని నిర్మానుష ప్రదేశంలో విడిచిపెడుతున్నామని గణేష్ వర్మ తెలిపారు. ఈ విష సర్పాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నాగుపాము కన్నా..
ఇటీవల క్వారీ ప్రాంతాల నుంచి లారీల ద్వారా కొన్ని రక్త పింజర జాతి పాములు కోనసీమలో పలు ప్రాంతాలకు చేరుకున్నాయని, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇది చూడడానికి కొండచిలువ పిల్లవలె కనిపిస్తుందని, నాగుపాము కన్నా దీని విషం చాలా ప్రమాదమని తెలిపారు. ప్రజలు వీటిని గమనించి చాలా దూరంగా ఉండాలని స్నేక్ క్యాచల్ గణేష్ వర్మ సూచించారు.
Also Read:
టీటీడీ చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ప్రమాణం
ఎవడబ్బ సొత్తని అరబిందోకు దోచిపెట్టారు
చంచల్‌గూడ జైలు నుంచి భాను కిరణ్ విడుదల
For More Telugu and National News
Updated Date - Nov 06 , 2024 | 05:37 PM