ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vizinagaram MP: చూశారా.. ఎంపీ గారి సింప్లిసిటీ

ABN, Publish Date - Nov 25 , 2024 | 03:03 PM

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు గెలుపొందాారు. పార్లమెంట్ సమావేశాలకు ఆయన సైకిల్‌పై వెళ్తున్నారు.

న్యూఢిల్లీ, నవంబర్ 25: రాజకీయాల్లో చిన్న పదవి ఉంటే చాలు.. ఎంతో హడావుడి చేసే నాయకులను చూస్తాం. పదవుల కోసం పైరవీలు.. చివరకు ఎమ్మెల్యేదో.. ఎంపీదో స్టిక్కర్ ఇస్తే కారుపై వేసుకుని తిరుగుతూ బిల్డప్‌లు కొట్టే నాయకులను నేడు ఎందరినో చూస్తుంటాం. కుటుంబంలో బంధువులు ఎవరైనా రాజకీయ పదవుల్లో ఉంటే దానిని వాడుకుని చేసే హడావుడి అంతా ఇంతా కాదు. పేరుకు పదవి ఉంటే చాలు.. లగ్జరీ కారుల్లో తిరుగుతూ హోదాలు అనుభవించే నాయకులు ఉన్న ఈ రోజుల్లో.. ఎంతో కష్టపడి పైకి వచ్చి ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలిచి.. ఎంపీగా ఎదిగినా.. సామాన్య జీవితాన్ని అనుభవించే వారిని చాలా తక్కువమందిని చూస్తుంటాం.


పదవిని బాధ్యతగా భావిస్తూ.. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావించి ఎటువంటి ఆడంబరాలకు పోకుండా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా వ్యవహారించే నాయకులు ఇప్పటికీ ఉన్నారంటే నమ్మశక్యం కావడంలేదు. కానీ ఎంపీగా గెలిచి.. సాదా సీదాగా ఉంటూ.. లోక్‌సభ సమావేశాలకు వెళ్తున్నారు. ఆయన ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్‌‌లోని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఈ ఏడాది పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఆయన సైకిల్‌పై వెళ్తున్నారు. పసుపు రంగు దుస్తులు ధరించి.. ఆయన సైకిల్‌పై నిరాడంబరంగా వెళ్తున్నారు.


మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యంతో కూడిన వాహనాలను ఆయన ఉపయోగించకుండా పార్లమెంట్ సమావేశాలకు కేవలం సైకిల్‌పై వెళ్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంపీ అనే అహంకారం ఆయనలో మచ్చుకైనా కనిపించదు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే నిరంతరం ఆయన తపిస్తుంటారని విజయనగరం జిల్లా ప్రజలు సైతం ఈ సందర్భంగా చర్చించుకుంటున్నారు. ఇంకోవైపు నవంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 20తో ముగియనున్నాయి.

For AndhraPradesh News And Telugu New

Updated Date - Nov 25 , 2024 | 03:20 PM