ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dasara 2024: దుర్గమ్మకి పట్టు వస్త్రాలు సమర్పించిన విజయవాడ సీపీ దంపతులు

ABN, Publish Date - Oct 02 , 2024 | 08:27 PM

ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు తన చేతుల మీదగా జరగడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. తన కుటుంబంతోపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు.

విజయవాడ, అక్టోబర్ 02: ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు తన చేతుల మీదగా జరగడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. తన కుటుంబంతోపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Also Read: భారతీయులు జాగ్రత్త.. అప్రమత్తమైన కేంద్రం..

Also Read: Dussehra Holidays 2024: దసర వేడుకలు చూడాలంటే.. ఈ నగరాలకు వెళ్లాల్సిందే..


సుమారు 4 వేల మంది పోలీసు సిబ్బంది ఈ ఉత్సవాల్లో బందో బస్తు పర్యవేక్షించనున్నారని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు పెద్ద పీఠం వేస్తున్నామని ఆయన వివరించారు. ప్రోటోకాల్ దర్శనాలకు సైతం టైం స్లాట్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రోటోకాల్ దర్శనాలు టైం స్లాట్ ప్రకారం చేసుకోవాలన్నారు. అందుకు సహకరించాలని విఐపీలకు ఈ సందర్భంగా విజయవాడ సీపీ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేశారు.

Also Read: Kolkata: ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు.. మమత ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్రం

Also Read: అక్టోబర్ 2: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి


సీపీ సతీమణి కామెంట్స్..

ఈ ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని సీపీ సతీమణి స్పష్టం చేశారు. తన వంతుగా తన భర్తకి ఎంతటి సహకారమైనా అందిస్తానని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. రేపటి నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి సిపి దంపతుల చేతుల మీదగా దుర్గమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పించారు.

Also Read: Kishan Reddy: ప్రధాని మోదీ తల్లి పేరుతో ప్రతి ఒక్కరు ఓ చెట్టు నాటండి

Also Read: Arvind Kejriwal: కొత్త ఇంటికి మారనున్న కేజ్రీవాల్


అంతకుముందు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో దసరా ఉత్సవాలు.. మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుము ప్రారంభమైనాయి. ఆ క్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లోని రావి చెట్టు వద్ద సీపీ రాజశేఖరబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Also Read: Arunachalam Tour: దసరా వేళ అరుణాచలేశ్వరుడి దర్శనం.. తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ

For AndhraPradesh News And Telugu News...

Updated Date - Oct 02 , 2024 | 08:28 PM