ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: ఉన్నతాధికారులు కీలక నిర్ణయం.. దుర్గమ్మ భక్తులకు సూచన

ABN, Publish Date - Nov 19 , 2024 | 07:58 PM

శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారిని శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి శంకరాచార్య విధుశేఖర భారతి స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ శృంగేరి పీఠాధిపతికి దుర్గ గుడి ఈవో రామారావుతోపాటు పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విజయవాడ, నవంబర్19: ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు దేవస్థానం కార్యనిర్వహాణాధికారి రామారావు మంగళవారం కీలక సూచన చేశారు. దుర్గ గుడి ఘాట్ రోడ్‌ను మూసి వేస్తున్నట్లు ఆయన తెలిపారు. నేటి నుంచి అంటే.. మంగళవారం సాయంత్రం నుంచి నవంబర్ 22వ తేదీ వరకు ఈ ఘాట్ రోడ్డు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: CM Chandrababu Naidu: రేపు మళ్లీ కేబినెట్ భేటీ

Also Read: High Court: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు


కొండ రక్షణ చర్యల పనుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై రాకపోకలకు సంబంధించి ఆంక్షలు విధించినట్లు ఈవో రామారావు వివరించారు. ఈ నేపథ్యంలో అమ్మవార్లు, అయ్యవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, వీవీఐపీలు, ఆయన సిబ్బంది కనకదుర్గా నగర్ మీదగా రావాలని ఆయన సూచించారు. అయితే వినాయకగుడి, స్నానాల రేవు నుంచి కనకదుర్గానగర్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు ఈవో వెల్లడించారు.

Also Read: Sabarimala: శబరిమలకు వెళ్తున్నారా.. వాటితో జాగ్రత్త

Also Read: KTR: రేవంత్ సర్కార్‌‌కి ప్రశ్నలు సంధించిన కేటీఆర్


మరోవైపు శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారిని శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి శంకరాచార్య విధుశేఖర భారతి స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ శృంగేరి పీఠాధిపతికి దుర్గ గుడి ఈవో రామారావుతోపాటు పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మహా మండపంలోని కళా వేదిక వద్ద భక్తులకు స్వామిజీ అనుగ్రహ భాషణం చేశారు.

Also Read: దబ్బ పండు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?

Also Read: Maharashtra Elections: పోలింగ్ వేళ.. చిక్కుల్లో బీజేపీ


ఇంకోవైపు కార్తిక మాసం నేపథ్యం.. అదీకాక మంగళవారం కావడంతో దుర్గగుడికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కనకదుర్గమ్మను భక్తులు దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. అందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 19 , 2024 | 07:58 PM