ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pallepanduga : పల్లెపండుగతో గ్రామాభివృద్ధి

ABN, Publish Date - Oct 18 , 2024 | 10:53 PM

రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెపండుగతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. కొండూరులో రూ.40 లక్షల ఉపాధి నిధులతో సిమెంటు రోడ్లకు బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బొజ్జా రోశన్న భూమి పూజ నిర్వహించారు.

కొండూరులో సిమెంటు రోడ్లకు శంకుస్థాపన చేస్తున్న విజయమ్మ, బొజ్జ రోశన్న

సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బొజ్జా రోశన్న

అట్లూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెపండుగతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. కొండూరులో రూ.40 లక్షల ఉపాధి నిధులతో సిమెంటు రోడ్లకు బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బొజ్జా రోశన్న భూమి పూజ నిర్వహించారు. కూటమి ప్రభుత్వంతోనే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పి.మల్లికార్జునరెడ్డి, నం ద గోపాల్‌రెడ్డి, కడప తెలుగు పార్లమెంటరీ అధ్యక్షు రాలు సుధారాణి, అమర్‌నాధరెడ్డి, సర్పంచ్‌ రామ చంద్రారెడ్డి, శివయ్య స్వామి, పీఆర్‌డీఈ సూర్యనా రాయణరెడ్డి, ఏఈ హసీనా, ఎంపీడీఓ భాస్కర్‌ బా బు, ఏపీఓ జయచంద్ర, గోపాల్‌రెడ్డి, రామక్రిష్ణా రెడ్డి, చెంచిరెడ్డి, సుబ్బారెడ్డి, గురురాజా, వెంకటసుబ్బ య్య, సంటెయ్య, జయక్రిష్ణారెడ్డి, నరసింహారెడ్డి, రాజ గోపాల్‌రెడ్డి, ఎల్‌.నారాయణరెడ్డి, జేసీబీ సుబ్బా రెడ్డి, పంచాయతీ సెక్రటరీ సుబ్బరాయుడు టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


రెడ్డికొట్టాలులో సిమెంట్‌ రోడ్డుకు భూమి పూజ చేస్తున్న ఎన్డీఏ నేతలు

అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట

కాశినాయన అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ ప్రభు త్వంలో అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట అని బీజేపీ నేత బొజ్జా రోశన్న, కడప టీడీపీ ఉపాధ్యక్షుడు బం గారు గుర్విరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పల్లె పండు గలో భాగంగా రెడ్డికొట్టాల, కొండపేట, సావిశెట్టిపల్లె ల్లో సిమెంట్‌ రోడ్లకు భూమిపూజ చేశారు. మండ లంలో మొదటి విడతలో రూ.1.75 కోట్లతో ప్రతి పంచాయతీలో సిమెంట్‌ రోడ్లను ఏర్పాటు చేస్తున్నా మన్నారు. కార్యక్రమంలో ఇటుకుల పాడు సర్పంచ్‌ సగిలి ప్రసాద్‌, బి.బి.నరసింహారెడ్డి, మురళి పీఆర్‌ ఏఈ బాలపుల్లయ్య, ఏపీఓ జయరాముడు, మండల తెలుగు యువత అధ్యక్షుడు పి.రవీంద్రారెడ్డి, టీడీపీ నేతలు రోహిత్‌రెడ్డి ఎల్‌.శ్రీనివాసులరెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, ఎం.విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

రామాపురంలో....

గోపవరం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): పల్లెపం డుగ వారోత్సవాలు గ్రామీణులకు వరం లాంటింద ని మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని మాజీఎమ్మెల్యే విజయమ్మ అన్నారు. గోపవరం మండలం రామాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీ ఓ రామనాధరెడ్డి, పీఓఆర్‌డీ షేక్‌ హసీనా, ఏవన్‌ కాంట్రాక్టర్‌, ప్రసాద్‌రెడ్డి, జడ్పీటీసీ జయరామిరెడ్డి, జిల్లా పార్లమెంటు రైతు కమిటీ కార్యదర్శి యల్లా రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


పెదుళ్లపల్లె పంచాయతీలో...

బి.కోడూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రామా ల అభివృద్ధే పల్లెపండుగ అని ఎంపీడీఓ భాస్కర్‌ రావు అన్నారు. పెదుళ్లపల్లె పంచాయతీలో రూ.10లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూ మిపూజ చేశారు. పాయలకుంట్ల పంచాయతీలో రూ.13లక్షలతో సిమెం టు రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్ర మంలో సర్పంచ్‌ కొమ్మూరు నరసింహులు, మాజీ సర్పంచ్‌ వెంకట సుబ్బారెడ్డి, పీఆర్‌ ఏఈ నారాయణ రెడ్డి, ఈసీ రాజా, మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, గోడి రమణరెడ్డి, ఓ.రమణారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, దుగ్గిరెడ్డి, రాఘవరెడ్డి, సౌదరి సుబ్బారెడ్డి, అన్ని శాఖల అఽధికారులు పాల్గొన్నారు.

రాజుపాలెంలో.....

కలసపాడు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రామంలో పల్లెపండుగను ఎంపీడీఓ మహబూబ్‌బీ ప్రారంభిం చారు. రూ.15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణం ప్రారం భించారు. పంచాయతీ సెక్రటరీ సదాశివ రెడ్డి, ఇంజనీరింగ్‌ అసిస్టెంటు రవికుమార్‌, మండల టీడీపీ నేతలు బాలిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 10:58 PM