ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP MLC: అనంతబాబుకు చుక్కలు చూపించిన దళితులు

ABN, Publish Date - Apr 02 , 2024 | 02:37 PM

అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ తగిలింది. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలవరీ చేసిన అనంతబాబుకు దళితులు చుక్కలు చూపించారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అనంతబాబును దళితులు తరమి తరమి కొట్టారు.

కాకినాడ, ఏప్రిల్ 2: అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ( YCP MLC Anathababu)కు నిరసన సెగ తగిలింది. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలవరీ (Deadbody door delivery) చేసిన అనంతబాబుకు దళితులు చుక్కలు చూపించారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అనంతబాబును దళితులు తరమి తరమి కొట్టారు. దళితుడిని హత్య చేసి బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల ఎలా వేస్తాంటూ అతడిని దళితులు నిలదీశారు.

నీకు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసే అర్హత లేదంటూ వారు మండిపడ్డారు. ఆ క్రమంలో అనంతబాబు గో బ్యాక్ అంటూ వారు బిగ్గరగా నినాదాలు చేశారు. దళితుడిని హత్య చేసి.. అతడి శవాన్ని ఇంటికే డోర్ డెలవరీ చేశావు కదా.. అలాంటి నీవు.. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేడయంతో... అపచారం జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆంబేద్కర్ విగ్రహానికి వారు పాలాభిషేకం చేశారు. దళితుల ఆగ్రహంతో అనంతబాబుతోపాటు వైసీపీ నాయకులు అక్కడి నుంచి తమ తమ వాహనాలపై వేగంగా వెళ్లిపోయారు.

అనంతబాబు.. తమ మనోభావాలను దెబ్బ తీశాడంటూ దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. అలాంటిది రాత్రి వేళల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించడం పట్ల.. ధర్మవరం గ్రామ ప్రజలు సైతం అనంతబాబుపై నిప్పులు చెరుగుతున్నారు.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Vangalapudi Anitha: రంగంలోకి వంగలపూడి రెష్మిత..!

AP Elections: వృద్ధులపై వైఎస్ జగన్ కుట్ర.. ఇదిగో సాక్ష్యం!

Updated Date - Apr 02 , 2024 | 02:43 PM

Advertising
Advertising