ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: వినుకొండ మర్డర్ వ్యక్తిగత మర్డర్... పొలిటికల్ మర్డర్ కాదు

ABN, Publish Date - Jul 22 , 2024 | 01:40 PM

వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయని.. లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. చితికిపోయిన రైతుల మీద పిడుగు పడినట్టు అయ్యిందన్నారు.

విజయవాడ: వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయని.. లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. చితికిపోయిన రైతుల మీద పిడుగు పడినట్టు అయ్యిందన్నారు. గత ఐదేళ్ళు జగన్ నిర్లక్ష్యంతో చితికిపోయారని రైతులు పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి మొదలెట్టిన జలయజ్ఞాన్ని జగన్ విస్మరించారన్నారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేక గేట్లు ఊడి నదుల్లో తేలడం చూశామన్నారు. రైతులను వదరలు ఏపీలో ఘోరంగా ముంచేశాయన్నారు. రైతులు ఎలా బతకాలి.. వర్షాలు, వరదలు పిడుగులా పడ్డాయని కూటమి సర్కార్ రైతులను ఆదుకోకపోతే రైతు అనేవాడు మిగలడని షర్మిల అన్నారు. రైతుల గురించి వారి పరిస్థితుల గురించి ఆలోచించి ఆదుకోవాలన్నారు.


కేంద్ర బడ్జెట్ ఎప్పుడూ షరామామూలే..

ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఎంతంమంది వచ్చారు‌..? గుజరాత్‌లో అయితే ఎంతమంది వస్తారని షర్మిల ప్రశ్నించారు. బీజేపీతో జతకట్టిన సీఎం చంద్రబాబు దీనిని మామూలు వర్షంగా చూడకుండా రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణాలో రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇస్తే రేవంత్ నిలబెట్టారని పేర్కొన్నారు. ఏపీలో అప్పు లేని రైతు లేడని.. ఒకొక్క రైతుకు సగటున 2.5 లక్షల అప్పుందన్నారు. ఏపీ ఎంపీలు అందరూ బీజేపీకే మద్దతు తెలిపారన్నారు. కానీ పదేళ్ళలో ఒక్క మేలు కూడా ఏపీకి బీజేపీ చేయలేదని షర్మిల అన్నారు. ఏపీ రైతులకు కూడా రుణమాఫీ చేసేలా కేంద్రాన్ని చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేయాలన్నారు. బీజేపీ కేంద్ర బడ్జెట్ ఎప్పుడూ షరామామూలేనని.. ఈ సంవత్సరం ఏమైనా మార్పుంటుందేమో.. చంద్రబాబు చెప్పాలని అన్నారు.


ఢిల్లీలో ధర్నా చేస్తారా?

‘‘రాజధాని కట్టుకోవడానికి లక్ష కోట్ల రూపాయలు అవుతుంది.. రాజధాని మాటేంటి? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదు అని నిన్న ఒక మంత్రి అన్నారు.. మరి కేప్టింగ్ మైన్స్ మాటేంటి? విశాఖ ఉక్కు ఉద్యోగుల జీతాలు ఇవ్వాలన్నా భూములు అమ్ముకుంటున్నారు. రైల్వే జోన్ కు భూములు విషయంలో బీజేపీ, వైసీపీ టెన్నిస్ ఆడుకున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీల మాటేంటి? కడప స్టీలు ఎడారిలా తయారైంది.. చెట్టెక్కిన భేతాళుడిలాగా ప్రత్యేక హోదా మారిపోయింది. ప్రత్యేక హోదా లేక పట్టుమని పది పరిశ్రమలు కూడా ఏపీకి రాలేదు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత చంద్రబాబుకు ఉంది. జగన్ హత్యా రాజకీయాలు చేశారు. ఏదీ పట్టించుకోని జగన్... ఇప్పుడు మీ కార్యకర్తలను చంపేస్తే ఢిల్లీలో ధర్నా చేస్తారా? అసెంబ్లీలో ఉండకుండా ఏం చేస్తారు మీరు? వినుకొండ మర్డర్ వ్యక్తిగత మర్డర్... పొలిటికల్ మర్డర్ కాదు. పోలీసులు ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? అని షర్మిల ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి...

AP Politics: జనసేనతో టచ్‌లోకి వైసీపీ మాజీ మంత్రులు.. పవన్ రిప్లై‌తో కంగుతిన్న నేతలు..!

Gautam Gambhir: రోహిత్, కోహ్లీ 2027 ప్రపంచకప్ కూడా ఆడగలరు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 22 , 2024 | 03:52 PM

Advertising
Advertising
<